సంగతి న్యూస్, ముంబై: నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం తర్వాత ఆయన మాజీ భార్య ష్యామలీ దే పెట్టిన ఇన్ స్టా పోస్టు చర్చనీయాంశంగా మారింది. వారి వివాహం జరిగిన రాత్రంతా తాను నిద్రపోలేదని, ఏవేవో ఆలోచనలతో గడిపానని భావోద్వేగాలతో నిండిన పోస్టు పెట్టారు. రాజ్ నిడిమోరు ఇటీవల నటి సమంతా రూత్ ప్రభును తమిళనాడులోని ఇషా యోగా సెంటర్, కోయంబత్తూరులో ఆధ్యాత్మిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం తర్వాత రాజ్ కుటుంబ నేపథ్యం పూర్వపరాలపై నెట్టింట జోరుగా వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మాజీ భార్య చేసిన ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చర్చలు లేపింది.
ఈ వివాహం తర్వాత ఆమె తన ఫీలింగ్స్ పంచుకుంటూ “నేను గత రాత్రంతా నిద్రపోలేక, ఆలోచనలు చేస్తూ గడిపాను. ఈ క్రమంలో ఎన్నో శుభాకాంక్షలు , కృతజ్ఞతలు వచ్చాయి. వాటిని పట్టించుకోవడం నా బాధ్యత. నాకు వ్యక్తిగతంగా ఏ టీమ్ లేనందున నేనే సమాధానం ఇస్తున్నాను. నా జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్. ప్రస్తుతం నేను దానిపైనే దృష్టి సారిస్తున్నాను. సోషల్ మీడియాలో ప్రస్తుతం నాకు కొంత విడిదిని ఇవ్వండి”. అంటూ అభ్యర్థించారు.
