సంగతి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాలి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోగా అందులోని 13 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది కాలిన గాయాలతో బయటపడినప్పటికి వారి పరిస్థితి విషమంగా ఉంది.
బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా గోర్లతు అనే గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు-హెబ్బులి జాతీయ రహదారిపై ఈ సంఘటన నెలకొంది. ఈ ఘటనలో ట్రక్కు కూడా పూర్తిగా కాలి బూడిదైంది. మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Add A Comment
