సంగతి న్యూస్, గోవా: గోవాలోని ఓ నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోగల బర్చ్ బై రోమియో లేన్ లోని ఈ క్లబ్ లో శనివారం అర్థరాత్రి ఎల్పీజీ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో దాదాపు 25మంది మృత్యువాత పడగా వీరిలో ఎక్కువ సంఖ్యలో అందులో పనిచేసే సిబ్బంది నలుగురు పర్యాటకులు ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ అధికారిక ప్రకటన చేశారు.
వీరంతా బేస్ మెంట్ విభాగంలో పనిచేస్తుండటంవలన మృత్యువాత పడ్డట్టు సమాచారం. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరిలో మరో ఏడుగురిని ఇంకా గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు శరవేగంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దర్యాప్తు ప్రారంభించామని, ఎల్పీజీ పేలుడు వలన ఇలా జరిగిందని, నిర్లక్ష్యంగా ఉన్న యజమానులపై చట్టప్రకారం చర్య తీసుకుంటామన్నారు.
గోవా, అగ్ని ప్రమాదం, సీఎం ప్రమోద్ కుమార్, Goa, Fire accident, cm pramod kumar
