కర్ణాటకలో డీజీపీ రేంజ్ అధికారి నిర్వాకం
తాను కాదంటున్న సదరు అధికారి
సంగతి, బెంగళూరు: డీజీపీ ర్యాంకు ఐపీఎస్ అధికారి వివాదంలో చిక్కుకున్నారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలతో అనుచితంగా ఉన్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ తీవ్ర చర్చకు దారి తీస్తుంది. పలువురు నెటిజన్లు సోషల్ మీడియాల్లో కామెంట్లు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో సీనియర్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే రామచంద్రరావు తన కార్యాలయంలో సన్నిహితంగా కొంతమందితో ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. వీటిని ఎవరో ఆయనకు తెలియకుండా తీసినట్లు అగుపిస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయానికి ఫిర్యాదుకు వెళ్లగా ఆయన విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే నిజమని తేలితే ఆయనపై చర్యలు కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా అది తాను కాదని, తన ఫొటోను ఎవరో మార్పింగ్ చేశారని అంటున్నారు.
Add A Comment
