హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు వింటారు. 20వ తేదీన పోచారం, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదనలకు అవకాశం ఇచ్చారు. ఇరు వర్గాల తరఫు న్యాయవాదుల వాదనలను స్పీకర్ వింటారు.
సుప్రీంలో విచారణ..
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వాదనలను వినేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
