. నీకు నీ కుటుంబానికి అధికారం రానివ్వ
. నా తోలు తీసుడు కాదు.. నిన్నే చీరతరు
. కొడంగల్ సభలో కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్
సంగతి, కొడంగల్: కేసీఆర్ (కే చంద్రశేఖర్ రావు), కల్వకుంట్ల కుటుంబానికి అధికారం దక్కడం ఇక కలే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని సవాల్ విసిరారు. కొడంగల్ నియోజక వర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ల కోసం బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
“కేసీఆర్ మంచి చెబుతాడని అనుకున్న. నాపై 181 కేసులు పెట్టారు. కుటుంబాన్ని వేధించాడు. ఇవన్నీ పట్టించుకుంటే రాష్ట్రం ఆగమైతదని నేను పట్టించుకోలే. ఆయనకు ఆయనే జైలులో ఉన్నట్లు తన ఫాం హౌజ్లో నే ఉంటున్నా నేను ఏమి అనలేదు. ఇక ప్రత్యేకంగా జైలు కూడా అక్కర్లేదు అనుకున్న. ఒక్కరిపై కూడా కక్ష పూరిత రాజకీయాలు చేయలేదు. పైన దేవుడే అన్నీ చేస్తాడని అనుకున్న. ఇప్పుడు బయటకు వచ్చి తోలు తీస్తా అన్నాడు. నా తోలు తీసుడు కాదు.. మా సర్పంచ్లు వచ్చిర్రు. వారు చీరి చింతకు కడతారు. ఒక్కమాట కూడా అక్కరకొచ్చిన మాట రాలేదు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఎస్ఎల్బీ, పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు.
ఇవన్నీ పూర్తి చేస్తే మేం కూడా మంచి పంటలు పండిచుకొని మంచి బట్టలు వేసుకునే వాళ్లం. నీ సొమ్మేం పోయింది. మాకు నీళ్లు ఇయ్యాలంటే నీకెందుకు అంత మంట. మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు. తోలు తీస్తా అని సోయిలేని మాటలెందుకు. ఆయన తోలు తీసుడు ఫాం హౌజ్లో ప్రాక్టీసు చేసినట్లుంది. నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటే తొక్క సిటీ.. వాడు వీడు వంతారా అని మాట్లాడుతున్నావ్.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాటలా ఇవి. నేను మాట్లాడితే బండ నడుముకు కట్టుకొని మల్లన్న సాగర్లో దూకుతావ్ కేసీఆర్. నాతో తమాషాలు చేయకు. నేను రైతు బిడ్డను. రియల్ ఎస్టేట్ పడిపోయిందని నీ కొడుకు అంటే నువ్వేమో రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటున్నవ్. ఇలాంటి మాటలా మాట్లాడేది” అంటూ పలు విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, దయారకర్ రావు, వినోద్ రావు, కృష్ణారావు రాసిపెట్టుకోండి బిడ్డా.. నీ రాజకీయం ఏంటో నేను చూస్తా.నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నిన్ను అధికారంలోకి రానివ్వను. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్న. బీఆర్ ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
