ఆ పదాలు వాడటం తప్పే
ఉద్దేశం మాత్రం మంచిదని వివరణ
సంగతి, సినిమా: ఎట్టకేలకు హీరో శివాజీ తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఇబ్బంది పెట్టేలా అవమాన పరిచేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నిండుగా వస్త్రాలు ఉంటే మంచిదని సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోవద్దని ఆయన చేసిన కామెంట్లు పలువురు సినీ నటీమణులు, మహిళాలోకం సామాజిక మాధ్యమాల, ఇతర వార్తా చానెళ్లలో తీవ్రంగా విమర్శించారు. కొందరు ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆయన మంగళవారం సాయంత్రం స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
“దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడిన సందర్భాల్లో నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెబుతూనే రెండు ఉపయోగించకూడని పదాలు(అన్ పార్లమెంటరీ వార్డ్స్) ఉపయోగించడం జరిగింది. ఇవి కచ్చితంగా కొంతమందిని బాధపెట్టడంతోపాటు వారి మనో భావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అందరు అమ్మాయిలను ఉద్దేశించి కాదు కొంతమంది హీరోయిన్స్ బయటకు వెళ్లినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమోమ్మ అని అన్నాను. తప్ప అవమాన పరచడం ఉద్దేశం కాదు. దొర్లిన మాటలకు క్షమాపణలు చెబుతున్న. నేనెప్పుడు స్త్రీ అంటే మహాశక్తి ఒక అమ్మవారిలాగే అనుకుంటా. ఈ రోజుల్లో స్త్రీని ఎంత తక్కువ చూస్తున్నారో మనందరికి తెలుసు. ఎవరికి ఆ అవకాశం ఇవ్వొద్దని ఉద్దేశంతో ఊరు భాషలో చెప్పాను. అలా చెప్పడం తప్పు. క్షమించండి. నా ఇంటెన్షన్ మంచిదే కాని ఆ రెండు పదాలు దొర్లకుంటే ఈ రోజు ఈ పరిస్ధితి లేదు. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమాన పరచాలని కించపరచాలని కాదు. ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఇబ్బంది పడ్డందుకు, ఇతర మహిళలకు అందరికి నా సిన్సియర్ అపాలజీస్” అని చెప్పుకొచ్చారు.
