రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి అంతర్జాతీయంగా తన క్రేజ్‌ను నిరూపించాడు. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ ‘Anan’ కవర్‌పై ప్రభాస్ కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ ఔట్ఫిట్లో స్టైలిష్‌గా కనిపిస్తున్న ప్రభాస్ లుక్కు జపాన్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోషూట్ ద్వారా జపాన్ మార్కెట్లోనూ ప్రభాస్‌కి ఉన్న ఫాలోయింగ్ మరోసారి బయటపడింది.
గతంలో ‘RRR’ సినిమా జపాన్‌లో ఘన విజయం సాధించగా, ఆ తర్వాత ఎన్టీఆర్‌కు అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే బాటలో జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరింత పెంచుతున్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, ఈ మ్యాగజైన్ కవర్ ఆయన గ్లోబల్ ఇమేజ్‌కు మరో మైలురాయిగా అభిమానులు భావిస్తున్నారు.
