సంగతి, సినిమా: మరోసారి రెబల్ స్టార్ సునామీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో ఆనందంగా ఈదేందుకు ప్రేక్షకులు సిద్ధమంటున్నారు. జనవరి 9, 2026 సంక్రాంతి సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ చిత్రం వెండితెరను వెలిగించనున్న విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తుండగా ప్రేక్షకులకు మరింత పూనకాలు వచ్చేలా చిత్ర యూనిట్ రాజాసాబ్ 2.0పేరిట రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీంతో యూట్యూబ్, సోషల్ మీడియా దుమ్మురేపుతోంది.
కొందరు ఫ్యాన్స్ అయితే, అప్పటి వరకు ఆగలేమని కొందరు, సంక్రాంతి అప్పుడే వచ్చేసిందని కొందరు ఆనందపరవశంతో ఊగిపోతున్నారు. ఈ ట్రైలర్ విడుదలయ్యాక మారుతీని మరింత భుజాలపై ఎత్తుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ట్రైలర్ ప్రకారం మంచి హర్రర్, కామెడీ టైమింగ్తోపాటు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసే సెంటిమెంట్ కూడా పుష్కలంగా డైరెక్టర్ పెట్టాడని తెలుస్తోంది. సెంటిమెంట్ సన్నివేశాలు ప్రభాస్ ఎలా పండిస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆ ఎలిమెంట్ కూడా ఈ ట్రైలర్ ద్వారా బయటకు కనిపించడంతో బొమ్మ అదుర్స్ అంటున్నారు ప్రేక్షకులంతా.. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి మరి..
Add A Comment
