కొత్త సాంగ్ వచ్చిందోచ్
సంగతి సినిమా, హైదరాబాద్: మెగాస్టార్ చిరు మరో కొత్త సాంగ్ ప్రోమో వచ్చేసింది. శశిరేఖా అంటూ ఆయన ఆనంద పరవశంలో ఆ పాటలో తేలిపోతున్నారు. కేరళ కొబ్బరితోటల నడుమ నదీ జలాలో బోటులో తేలుతూ నేనొక మాట చెబుతా ఫీలుకాక అంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. అనిల్ రావిపుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే మీసాల పిల్లా అనే సాంగ్ విడుదలై నెట్టింట షేక్ చేసి సోషల్ మీడియాలో కూడా దుమ్ము రేపుతోంది. కాగా చిత్ర యూనిట్ రెండో సింగిల్ గా శశిరేఖా అనే సాంగ్ ప్రమో విడుదల చేశారు. ఈ పాటలో చెప్పాలనుకున్న మాట చెప్పేయ్ మోమాట పడకా అంటూ హీరోయిన్ నయాన తార ఆయనను ఎంకరేజ్ చేస్తున్నారు. పూర్తి పాటను డిసెంబర్ 8న విడుదల చేయనుండగా సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.
Add A Comment
