ఇంటర్నెట్‌డెస్క్: ‘వారణాసి’.. ఒక్క మాట చెప్పకుండా తాను తీయబోయే సినిమా స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి మరోసారి చూపించారు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు, ఈ చిత్ర (Varanasi Movie) కథా నేపథ్యాన్ని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న అంశాలేంటి?(varanasi movie story) వాటి నేపథ్యమేంటి? అంతుచిక్కని రహస్యం కాశీ క్షేత్రం.. వీడియో ఫస్ట్ షాట్. అది 512CE కాలం. వారణాసి క్షేత్రం. కాశీ పట్టణం పుట్టుక ఇప్పటికీ అంతుచిక్కని ఓ రహస్యం. కల్పం మొదట్లో ప్రకృతి మొత్తం జలమయమై ఉందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం కోసం తపస్సు చేసుకోవడానికి శివుడు త్రిశూలాగ్రమ్మీద…
Author: admin@sangathi
అగ్ర కథానాయకులు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి-2025) వేడుకల్లో వీరిద్దర్నీ ప్రత్యేకంగా సన్మానించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు. ‘‘చిత్ర పరిశ్రమలో 50ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్, బాలకృష్ణలను సత్కరించనున్నాం. భారతీయ చలన చిత్ర సంస్కృతిపై వారి శాశ్వత ప్రభావాన్ని వేడుకలా చేసుకునే మైలురాయి ఇది. వారిద్దరూ దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో ఎన్నో మంచి కథల్ని ప్రేక్షకులకు అందించి గొప్ప ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారు. అందుకే వాళ్ల కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నాం’’ అని ఎల్.మురుగన్ తెలిపారు. సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఇఫి-2025 వేడుక ఈనెల 20 నుంచి 28వరకు గోవా వేదికగా జరగనుంది.
హైదరాబాద్: భాజపా అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ఓట్లు తొలగించి చోరీకి పాల్పడుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనున్నట్లు చెప్పారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యూత్ కాంగ్రెస్ సైనికులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి శక్తివంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా ఓటుచోరీపై నిరసనలు ఉద్దృతం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే, సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన యాత్రికులకు యూత్ కాంగ్రెస్ నివాళులర్పించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణలో వాదనలకు అవకాశం ఇస్తూ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న తెల్లం వెంకట్రావు, సంజయ్‌పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి వాదనలు వింటారు. 20వ తేదీన పోచారం, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదనలకు అవకాశం ఇచ్చారు. ఇరు వర్గాల తరఫు న్యాయవాదుల వాదనలను స్పీకర్ వింటారు. సుప్రీంలో విచారణ.. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ స్పీకర్‌కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వాదనలను వినేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఆపేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై (Traiffs On Russias trading partners) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మాస్కోతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు (Trump Traiffs) విధిస్తానన్నారు. ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు…
ఇంటర్నెట్ డెస్క్: తన మద్దతుదారులకు ఆమె ఒక ఆధునిక, అభివృద్ధి చెందుతున్న బంగ్లాదేశ్ నిర్మాత. విమర్శకులకు మాత్రం.. అధికార దాహంతో ఉన్న నిరంకుశ నాయకురాలు. ఆమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina). దశాబ్దాల పాటు ఆ దేశ రాజకీయ చరిత్రను తానై నడిపించిన ఆమెను ‘ఉక్కు మహిళ’గా వ్యవహరిస్తుంటారు. కానీ, తన హయాంలో ఏర్పడ్డ ట్రైబ్యునలే.. ఇప్పుడు ఆమెకు మరణశిక్ష (Sheikh Hasina death sentence) విధించడం గమనార్హం. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా.. నాటి తూర్పు పాకిస్థాన్‌లోని తుంగిపారాలో 1947 సెప్టెంబరు 28న షేక్ హసీనా జన్మించారు. తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించి జాతిపితగా నిలిచిపోయారు. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు.…
కేవలం సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌కు కోట్ల రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన ఐ బొమ్మ రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి గురించి ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం సినిమాలో సూపర్ హిట్ సీన్‌లా ఉందన్నారు. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో తీసుకెళ్లి కటాకటాల వెనక్కి పంపినట్లు ఉందని తెలిపారు. తనకు తానే భస్మాసుర హస్తంలాగా బయట పెట్టుకున్నాడు.. పోలీసులతో ఎవరూ కూడా ఛాలెంజ్ చేయవద్దని అన్నారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందే రాజమౌళితో పాటు…
రేపటి నుంచి (నవంబర్ 18) మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్ అబుదాబీ టీ10 లీగ్ మొదలుకానుంది. ఈ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అన్ని జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. విండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ నేతృత్వంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండుగలో ప్రపంచవ్యాప్తంగా ఉండే విధ్వంకర బ్యాటర్లు పాల్గొనున్నారు. ఈ లీగ్‌లో భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, మురళీ విజయ్ లాంటి వారు పాల్గొంటున్నారు. అబుదాబీ టీ10 లీగ్ 2025 వివరాలు.. డెక్కన్ గ్లాడియేటర్స్ (నికోలస్ పూరన్), అజ్మన్ టైటాన్స్ (మొయిన్ అలీ), అస్పిన్ స్టాల్లియన్స్ (సామ్ బిల్లింగ్స్), ఢిల్లీ బుల్స్ (రోవ్‌మన్ పావెల్), నార్త్రన్ వారియర్స్ (షిమ్రోన్ హెట్‌మైర్), క్వెట్టా క్వావల్రీ (లియామ్ లివింగ్‌స్టోన్), రాయల్ ఛాంప్స్ (జేసన్…
బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు , ఉమ్రా యాత్ర సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఒకే కుటుంబంలోని 18 మంది గ్రూప్ ఫొటో న్యూఢిల్లీ/సాక్షి, నెట్‌వర్క్/సాక్షి,న్యూఢిల్లీ:సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా, మదీనా సందర్శించుకోవాలనే తమ చిరకాల వాంఛను తీర్చుకునేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లిన 45 మంది ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో 43 మంది నగరానికే చెందిన వారు కాగా, మరో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా మంటలు చెలరేగడంతో అంతా సజీవ దహనమయ్యారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున మదీనాకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఉదయాన్నే అందిన పిడుగుపాటు లాంటి వార్త నగర వాసుల్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని…
ఢిల్లీ పేలుడు ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో హ్యుందయ్ ఐ20లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్‌కు.. భారత్‌లోని జైషే మహమ్మద్ నెట్‌వర్క్ స్థాపించేందుకు చేసే ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ఉగ్రవాది డాక్టర్ షాహిన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో పాటు ఇతర ఉగ్రకుట్రకు సంబంధింత అంశాల్లో అనుమానాస్పద వ్యక్తులతో చేసిన చాటింగ్, అందుకు ఉపయోగించిన కోడ్ సైతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనతో పాటు జైషే మహమ్మద్‌తో సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో డాక్టర్ షాషిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు ఆమె కదలికలు, ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డాక్టర్ షాహిన్ ఫోన్ నుంచి సేకరించిన వాట్సప్‌లో కీలక ఆధారాల్ని వెలుగులోకి తెచ్చారు. మేడమ్ X,మేడమ్ Z వాటిల్లో మేడమ్ X,మేడమ్ Z పేరుతో సేవ్ చేసిన మహిళలతో…