భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పలు ప్రతిష్టాత్మక మిషన్లను రాబోయే రోజుల్లో చేపట్టనుంది. ఇందులో చంద్రయాన్-4, గగన్‌యాన్, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు వంటి కీలక ప్రయోగాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఏకంగా ఏడు ప్రయోగాలు నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడంతో పాటు, సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. హైలైట్: వరుస ప్రయోగాలతో జోరుమీదున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రాబోయే రోజుల్లో చేపట్టబోయే మిషన్ల గురించి కీలక వివరాలను వెల్లడించింది. ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే ప్రయోగాల నుంచి వివరించారు. చంద్రయాన్-4, మానవసహిత రోదసీ యాత్ర గగన్‌యాన్, భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, ఉపగ్రహ ప్రయోగాలు సహా పలు మిషన్లతో కూడిన భారీ ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. ఈ…
Author: admin@sangathi
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ శనివారం పరిశీలించారు.అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి.. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన తిరుగుతూ అడవిలోని చెట్లను పరిశీలించారు.ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించిన పవన్ కళ్యాణ్.. అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగేగుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను తిలకించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు.
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై ఆంక్షలు విధించే కొత్త బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ బలమైన మద్దతు ప్రకటించారు. ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే.. రష్యాతో వ్యాపారం చేసే దేశాల దిగుమతులపై 500 శాతం వరకు టారిఫ్‌లను విధించనున్నారు. రష్యాకు చైనా తర్వాత రెండో అతిపెద్ద ఇంధన కొనుగోలుదారుగా ఉన్న భారత్‌పై ఈ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి తోడు.. ట్రంప్ పరిపాలన ఇప్పటికే రష్యన్ ముడి చమురు కొనుగోలుకు గాను భారత్ దిగుమతులపై 25 శాతం జరిమానాతో సహా మొత్తం 50 శాతం టారిఫ్‌ను విధించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికపరమైన అడ్డంకులు సృష్టించే లక్ష్యంతో.. రష్యాతో వాణిజ్యాన్ని చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై…
సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్ర సందర్భంగా జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది యాత్రికులు మరణించడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు.. బాధిత కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున సౌదీకి తీసుకెళ్లేందుకు మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపాలని ప్రభుత్వం తీర్మానించింది. సౌదీలో బస్సు ప్రమాదం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటన(ఫోటోలు- Samayam Telugu)సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు మరణించిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నిర్ణయించింది. ఈ దుర్ఘటన కారణంగా విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ కుటుంబం మొత్తం 18 మందిని…
Agniveer – Agnipath Scheme| దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ ఒక గొప్ప అవకాశం. ఇది సైన్యంలో చేరేందుకు ఒక సులువైన మార్గం. పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులు కూడా అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశానికి సేవ చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఎంపికైన వారిని అగ్నివీర్ అని పేర్కొంటారు. అగ్నివీరులకు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సైన్యంలో పూర్తి స్థాయి ఉద్యోగిగా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇతర రంగాల్లో ఉద్యోగంలో చేరవచ్చు. మంచి జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. దేశ సేవతో పాటు మంచి భవిష్యత్తును కోరుకునేవారికి మంచి అవకాశం అయిన అగ్నిపథ్ పథకం గురించి పూర్తి వివరాలు.. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం ఒక గొప్ప అవకాశం…
Indiramma Illu Scheme: పేదల సొంతింటి కలను నెరవేర్చి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు పథకం’ అమలు చేస్తోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకానికి అర్హులే. నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పూరిగుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో ఉంటున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సొంత స్థలం ఉన్నవారికి తొలి దశలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా పనుల పురోగతిని అప్‌డేట్ చేస్తుండగా.. ఏఐ సాంకేతికతో అక్రమాలను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర కీలక వివరాలు.. సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ఎలాంటి వారికైనా ఒక అపురూపమైన కల. మరి పేదలకు సొంతిల్లు నిర్మించుకోవడం అనేది చాలా పెద్ద కల. పేదలకు, గూడు లేనివారికి సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ఇందిరమ్మ…
Prime Minister Viksit Bharat Rozgar Yojana Scheme | యువత కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి PMVBRJY కింద రూ.15000 అందజేస్తారు. ఉద్యోగం కల్పించిన కంపెనీకి ఒక్క ఉద్యోగికి నెలకు రూ.3000 వరకు ఇస్తారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 2025 ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ పథకం గురించి ప్రకటన చేశారు. వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం ప్రయోజనాలు, అర్హతలు తదితర పూర్తి వివరాలు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున రూ.15 వేలు…
ఫలితంతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ.. కొన్నిరోజుల క్రితమే ‘మాస్ జాతర’తో వచ్చాడు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండేసరికి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్‍గానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది. ఇప్పుడు రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా సమంతని తీసుకోబోతున్నారనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. శివ నిర్వాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్టులే గుర్తొస్తాయి. చివరగా తీసిన ‘ఖుషి’ లవ్ స్టోరీనే. అందులో హీరోయిన్ సమంతనే. అయితే శివ ఈసారి ఓ…
ప్యారిస్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్, నటులు అజిత్, అరవిందస్వామి, లివింగ్‌స్టన్, నటి ఖుష్బూ, డైరక్టర్ మురుగదాస్ తదితరుల ఇళ్లలో బాంబు ఉన్నట్లు సోమవారం డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసులు తనిఖీ చేపట్టగా అబద్ధమని తెలిసింది. బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యవహారమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి (Delhi blast). ఈ నేపథ్యంలో మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్ (Shaheen Shahid).. ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించింది. ఈ నెట్‌వర్క్ ఆరు నగరాలు లక్ష్యంగా డీ-6 మిషన్‌కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి వంటి ప్లాన్స్ బయటకువస్తున్నాయి. జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితులను విచారించగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అధికారిక వర్గాల ప్రకారం.. ఫరీదాబాద్‌లో అరెస్టయిన షాహిన్.. టెర్రర్ మాడ్యూల్ (Faridabad Terror Module)కు కీలక వ్యక్తి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్…