సంగతి న్యూస్ , మాస్కో: తాము యూరప్ తో యుద్ధానికి సిద్ధం అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో శాంతి పరిష్కారం కోసం మాస్కోలో రష్యా–అమెరికా కీలక చర్చలు జరుగుతుండగా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపినట్లయింది. “యూరప్ యుద్ధం ప్రారంభించాలని నిర్ణయిస్తే, పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అప్పుడు చర్చలు జరపడానికి ఎవరూ మిగలకపోవచ్చు” అని పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. చర్చలు ముందుకెళ్లాలని యూరప్ కోరుకోవడం లేదని ఆయన అన్నారు. ముందుకు సాగని అమెరికా దౌత్యం అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌తో జరిగిన దాదాపు ఐదు గంటల చర్చలు జరిగాయి. అయితే, వీటిల్లో ఎలాంటి పురోగతి లేదని క్రెమ్లిన్ తెలిపింది. అమెరికా నుంచి వచ్చిన నాలుగు ప్రతిపాదనలను వచ్చినప్పటికీ పలు కీలక అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయని…
Author: admin@sangathi
సంగతి న్యూస్ , న్యూఢిల్లీ: మానవత్వం చాటుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే భారత్ పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. తాము శ్రీలంకకు సాయం చేద్దామంటే భారత్ అంగీకరించలేదని ఆ దేశ విదేశాంగమంత్రి వ్యాఖ్యలు చేశారు. దీనికి వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ ఆరోపణలను ఖండించింది. పాక్ మాటలు “అసంబద్ధమైనవి” “తప్పుడు సమాచారం వ్యాప్తి చేసివి”గా అభివర్ణించింది. శ్రీలంక తీరంలో ప్రమాదంలో ఉన్న కొందరికి సాయం చేయడం కోసం భారత వాయుసరిహద్దుల ఉపయోగించుకునేందుకు డిసెంబర్ 1న మధ్యాహ్నం 1 గంటకు పాక్ నుంచి అభ్యర్థన వచ్చిందని, ఆ సహాయం అత్యవసరమని భావించి భారత్ వెంటనే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1, 2025 సాయంత్రం 5:30కు అనుమతిని మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం భారత్ పై తప్పుడు ప్రచారం చేసే చర్య తప్ప మరొకటి కాదని భారత్ కొట్టిపడేసింది
సంగతి, టర్కీ: ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్నా రష్యా ఉక్రెయిన్ మధ్య మాత్రం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నల్లసముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్ పై వరుసగా రెండుసార్లు డ్రోన్‌లతో దాడి జరిగింది. రష్యాకు పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు తెచ్చే విరాట్ షాడో ట్యాంకర్ (క్రూడ్ అయిల్ )పై తాము రెండు డ్రోన్ లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేసింది. శనివారం ఉదయం డ్రోన్ దాడికి గురయ్యే ముందు ట్యాంకర్ సిబ్బంది ఓపెన్-ఫ్రీక్వెన్సీ రేడియోలో అత్యవసర సంకేతం పంపించారు. “ఇది విరాట్ డ్రోన్ అటాక్ -మే డే” అంటూ అందులోని సిబ్బంది అరుపులు అందులో వినిపించాయి. అయితే దాడికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఫుటేజీ ప్రకారం అది గాల్లో ఎగిరే ‘డ్రోన్’ కాకుండా నీటిమీద ప్రయాణించే మానవ రహిత సముద్ర వాహనం నుంచి ప్రయాణించే డ్రోన్ కావడం గమనార్హం.టర్కీ ధృవీకరణబ్లాక్ సీ తీరానికి సుమారు 35 నాటికల్…
సంగతి న్యూస్, మధ్యప్రదేశ్: ఓ విద్యార్థి విషయంలో ఘోరం జరిగింది. సరదాగా చేసిన ఓ చిన్నపనికి ఓ ప్రైవేటు పాఠశాల కఠినంగా వ్యవహరించింది. 52 సార్లు సారీ చెప్పినా అతడిని ఆత్మహత్యకు ప్రయత్నించేలా పురికొల్పింది. స్కేటింగ్ క్రీడాకారుడైన ఆ బాలుడు మూడో అంతస్తు నుంచి దూకి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని రత్నం జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ విషాద ఘటన చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. అసలేం జరిగింది? 13 ఏళ్ల బాలుడైన సదరు విద్యార్థి గురువారం మొబైల్ ఫోన్ తీసుకువచ్చి తరగతి గదిలో పాఠాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది గుర్తించిన పాఠశాల యాజమాన్యం అతని తల్లిదండ్రులకు కబురు చేసి రమ్మంది. అక్కడున్న పాఠశాల సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఆ బాలుడు…
ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో ‘మహాగఠ్‌బంధన్’ ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. పాట్నాలోని తేజస్వి నివాసంలో సోమవారంనాడు జరిగిన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘోపూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా తేజస్వి గెలిచారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు జరిపిన సమావేశంలో ఎన్నికల్లో ‘మహాగఠ్‌బంధన్’ ఓటమికి కారణాలను విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఆర్జేడీ దయనీయ పరిస్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కారణమంటూ ఆరోపించిన సంజయ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విస్తృత చర్చల అనంతరం ఈవీఎంల హ్యాకింగ్, ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరే ఓటమికి కారణాలనే అభిప్రాయానికి…
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్వీని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదని అన్నారు. పాట్నా: ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన కలహాలు ముదురుతున్నాయి. తేజస్వి యాదవ్, ఆయన అనుయాయులు తనను అవమానించి, దాడికి ప్రయత్నించారంటూ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) ఆరోపిస్తూ రాజకీయాలతో పాటు కుటుంబానికి ఉద్వాసన చెప్పడం కలకలం రేపింది. దీనిపై రబ్రీదేవి సోదరుడు, ఆర్జేడీ మాజీ ఎంపీ అనురుధ్ ప్రసాద్ యాదవ్ అలియాస్ సాధు యాదవ్ (Sadhu Yadav) తాజాగా స్పందించారు. రోహిణి ఆచార్యకు మద్దతుగా నిలుస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చతికిలపడడానికి తేజస్వి యాదవ్ బాధ్యుడని అన్నారు. ‘లాలూ కుటుంబ సభ్యులు కాకుండా బయట వ్యక్తులు ఇందుకు బాధ్యులైతే ఇది చాలా దురదృష్టకరం. ఈ కలహాలు కుటుంబానికి కానీ, పార్టీకి కానీ మంచిది కాదు’ అని సాధు యాదవ్ అన్నారు. ఆయన (తేజస్వి) అనుచితంగా…
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ ప్రపంచంలోని పది అతిపెద్ద బ్యాంకులు ఏవో మీకు తెలుసా? CompaniesMarketCap.com పది అతిపెద్ద ప్రపంచ బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జెపి మోర్గాన్ చేజ్ అమెరికాకు చెందిన జెపి మోర్గాన్ చేజ్ వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. $686.13 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంకు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక పరిశ్రమలో కూడా అగ్రగామిగా ఉంది. ఈ చైనీస్ బ్యాంకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది. అమెరికా లాగే, చైనా కూడా ప్రపంచ బ్యాంకింగ్ చార్టులలో తన బలమైన స్థానాన్ని నిలుపుకుంది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC) $320.05 బిలియన్ల…
Cognizant: ఐటీ రంగంలో ఉద్యోగులు ఏం చేస్తున్నారనేదానిపై ప్రతిరోజు నిఘా ఉంటుంది. ఒక ఉద్యోగి ఎంత సేపు వర్క్ చేస్తున్నాడు?, ఎంతసేపు ఖాళీగా ఉంటున్నాడు అనే దానిపై కంపెనీలు చూస్తుంటాయి. అయితే, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఇదే తరహాలో ఎంప్లాయిస్ కార్యకలాపాలపై నజర్ పెట్టింది. దీని కోసం కొత్త మానిటరింగ్ వ్యవస్థను తెచ్చింది. కంపెనీ జారీ చేసే ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా ఉద్యోగుల పని తీరును ట్రాక్ చేయనుంది. వారు ఉపయోగించే కీబోర్డు, మౌస్‌లను ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఈ స్థాయిలో ట్రాకింగ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఉద్యోగుల ల్యాప్‌ట్యాప్/ డెస్క్‌టాప్‌లో ఈ ట్రాకింగ్ కోసం ప్రోహ్యాన్స్ లాంటి టూల్స్‌ను కాగ్నిజెంట్ సంస్థ వాడుతుంది. ఎంప్లా్య్ ఖాళీగా ఉండే టైంని ఈ టూల్ ద్వారా ట్రాక్ చేస్తారు. మౌస్ లేదా కీబోర్డును ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్-యాక్టివ్‌గా ఉంచితే సదరు ఉద్యోగి…
జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ కార్యకర్తల్లారా.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోగానే కుంగిపోవద్దని, భవిష్యత్తు మనదే అని అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని పేర్కొన్నారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని.. కులం, మతం పునాది మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. వేలాది మంది బీజేపీ కారకర్తలు, వందల మంది నాయకుల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా.. సీఎం, మంత్రులు, కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్నా అని ఎంపీ ఈటల చెప్పారు. ‘నారాయణఖేడ్, పాలేరు హుజూర్నగర్, నాగార్జున సాగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అన్నిటిలో అధికార పార్టీ గెలిచింది. కేసీఆర్ అహంకారం అణచడానికి దుబ్బాకలో బీజేపీని గెలిపించారు. అన్యాయానికి న్యాయానికి.. ఆత్మగౌరవానికి అహంకారానికి..…
Priyanka Chopra : ప్రియాంక చోప్రా అంటే అందం, అట్టిట్యూడ్, క్లాస్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక, ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ప్రస్తుతం ఈమె రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ హీరోగా వస్తున్న వారణాసిలో కీలక పాత్రలో కనిపిస్తోంది. Read this : Premante Movie : ఆసక్తికరంగా ప్రియదర్శి ప్రేమంటే ట్రైలర్..