సంగతి న్యూస్ టీం, హైదరాబాద్: తన అభినయంతో తెలుగు, తమిళమే కాకుండా యావత్తు దేశంలోని ప్రేక్షకులను కట్టిపడేసి మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి పుట్టిన రోజు నేడు (డిసెంబర్- 6).పలు చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిత్వంలో చాలా గొప్పది. తాను నటించిన చిత్రాల ద్వారా పెద్ద మొత్తంలో సంపద వచ్చినా అవన్నీ కూడా దానధర్మాలు చేసి నిరాడంబరాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. నటనలో ఆమె ఏ విధంగా దిగ్గజ స్థానమో అంతటి సౌమ్యురాలు. డిసెంబర్ 6, 1936 జన్మించిన ఆమె డిసెంబర్ 26, 1981లో కన్నుమూశారు. ఈమె స్వస్థలం గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ఆమె పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చేతిలో పెరిగింది. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి అడుగుపెట్టి హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం…
Author: admin@sangathi
సంగతి న్యూస్, బెంగళూరు: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. బెంగళూరు పబ్‌లో అసభ్య కరమైన విధంగా మిడిల్ ఫింగర్ చూపించి వివాదం మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.నవంబర్ 28న అశోకనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పబ్‌లో జరిగిన ఘటనలో పబ్ బాల్కనీ నుంచి క్రింద ఉన్న జనాలకు ఆర్యన్ ఖాన్ మధ్యవేలు చూపించినట్లు వీడియోలో కనిపించింది. ఆ సమయంలో ఆయనతోపాటు కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్, ఎమ్మెల్యే హారీస్ కుమారుడు మొహమ్మద్ నలపాడ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్యన్ ఖాన్ ఈ ప్రవర్తనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది నెటిజన్లు బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సంగతి న్యూస్, బెంగళూరు: బెంగళూరులో ఘోరం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి మెట్రో ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో మెట్రో పర్పుల్ లైన్ సేవలు నిలిపివేశారు. అయితే, ఈ ఘటన ప్రమాదం వలన జరిగిందా .. తానే కావాలనే పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కెంగేరి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
సంగతి స్పోర్ట్స్ న్యూస్: రెండో వన్డేలో టీమిండియా దక్షిణాఫ్రికాతో పరాజయం పాలైన నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీని వన్డే జట్టులో పక్కకు పెట్టడంపై ఆయన భేదాభ్రియాలు వెలిబుచ్చారు. “షమీ ఎక్కడ? ఎందుకు ఆడించడం లేదు? అతడు మంచి బౌలర్ ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. షమీ వంటి అనుభవజ్ఞుల్ని పక్కన పెట్టడంతో బౌలింగ్ దెబ్బతిన్నది,” అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారు. “ప్రసిద్ధ్ మంచి బౌలర్ . కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. మీ వద్ద మంచి బౌలర్లు ఉన్నారు, కానీ వారిని పక్కన పెట్టేశారు. బుమ్రా ఉంటే ఈ బౌలింగ్ ఒకలాగ లేకపోతే మరోలాగా అవుతుంది. బుమ్రా లేకపోయినా గెలిచేలాగ జట్టు తయారుకావాలి” అంటూ వ్యాఖ్యానించారు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ పెట్టిన 358 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్రికా 4 వికెట్లతో ఛేదించింది. ఈ మ్యాచ్లో…
సంగతి న్యూస్, ముంబై: అనూహ్యంగా అఖండ-2 సినిమా వాయిదాపడి అభిమానులంతా నిరుత్సాహంలో ఉండగా వారికి పండగ లాంటి వార్తొకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ సినిమా పూనకాలే అన్నట్లుగా ఉందని ప్రముఖ మూవీ క్రిటిక్ ఉమేర్ సంధూ రివ్యూ ఇచ్చారు. తాను అఖండ-2 చూశానని, ఇది పక్కా పైస్ వసూల్ మాస్ ఎంటర్ టైన్ చిత్రమన్న ఆయన బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి పండగే అని తన ఎక్స్ వేదికలో రాసుకొచ్చాడు. ఇందులోని భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయని, గుక్క తిప్పుకోలేని డైలాగ్స్, మరియు విజిల్స్ కొట్టించే క్లైమాక్స్ ఉందని చెబుతూ 5కి 3స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రతి చిత్రం సెన్సార్ పూర్తవగానే ముందు రివ్యూలు ఉమేర్ ఇచ్చే విషయం తెలిసిందే. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వలన అఖండ-2 చిత్రం తెలుగు ప్రాంతాల్లో ముందు ప్రీమియర్ లు తర్వాత చిత్ర విడుదలనే రద్దు చేశారు. త్వరలో ఈ చిత్ర విడుదలను…
సంగతి న్యూస్, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రూపాల్లో భారత్‌పై అమెరికా ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం సాయంత్రం 6.35గంటల ప్రాంతంలో ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయనను స్వయంగా ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం, కరచాలనంతో స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యం, మరియు ఒప్పందాలతో ఉండనుంది. భారత్-రష్యా 23వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆయన నాలుగేళ్ల తర్వాత భారత్లో అడుగు పెట్టారు. ఇంధనం, పరిశోధన, అంతర్జాతీయం వంటి అంశాలపై ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. పర్యటనలోని ప్రధాన అంశాలుపుతిన్ సాయంత్రం 6:35 గంటలకు ఢిల్లీలో దిగగానే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పలాం ఎయిర్‌పోర్టులో ఆలింగనంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనకు ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాష్టపతి భవన్‌లో సత్కార కార్యక్రమంతో శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం హైదరాబాద్…
సంగతి న్యూస్, సిద్ధిపేట: గ్రామాల్లో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. సామాన్య వ్యక్తి నుంచి గ్రామాల్లో ఆధిపత్యం చూపించే పెద్దల వరకు తమ తమ స్థాయిలో జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎవరి స్థాయికి తగినట్లు వారు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఉచిత హామీలకు లెక్కే లేదు. అయితే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సైతం తానేం తక్కువ కాదన్నట్లు ఓ వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వార్డు మెంబర్ గా పనిచేస్తున్న తన భార్యను గెలిపిస్తే ఆ వార్డులోని పురుషులందరికి ఉచితంగా జుట్టు కత్తిరిస్తానని(హెయిర్ కటింగ్) చేస్తానని ప్రకటించాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ ప్రకటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామంలో వెలువడింది. కటింగ్, షేవింగ్ తోపాటు వార్డును కూడా తాను అభివృద్ధి చేస్తానంటున్నాడు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్న నేటి రోజుల్లో తన వృత్తిని తన భార్య విజయం కోసం వెచ్చిస్తానడంతో…
సంగతి న్యూస్, న్యూఢిల్లీ: తనకంటే అందంగా ఉన్నారని పూనమ్ అనే మహిళ చిన్నారులపట్ల దారుణాలకు పాల్పడింది. మేన కోడలయిన విధి అనే ఆరేళ్ల పాపను నీటిడబ్బాలో ముంచి చంపింది. అంతకు ముందు కూడా మరో ఇద్దరు కోడళ్లను ఇలాగే చంపినట్లు తెలుస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన హర్యానాలోని పానీపట్‌లో జరిగింది. 2021లో తాజాగా చనిపోయిన పాపపైనే వేడి వేడి టీ పోసి చంపేందుకు ప్రయత్నించిందని, ఆ సమయంలో అది ప్రమాదం వలన జరిగిందని కుటుంబ సభ్యులు భావించారని పోలీసులు తెలిపారు. 2023లో తన సొంత కుమారుడిని కూడా హత్య చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం, ఈ హత్యలకు ‘బ్యూటీ కంప్లెక్స్’ అంటే తనకన్నా అందంగా ఉన్న చిన్నారులను చూసి ఈర్ష్యతో దాడి చేయడమని చెబుతున్నారు. తాజాగా ఓ కుటుంబ వేడుక సందర్భంగా స్టోర్‌రూమ్‌లో విధిని నీళ్ల డబ్బాలో ముంచి చంపినట్టు ఆమె ఒప్పుకుందని మరో రెండు…
సంగతి న్యూస్, ముంబై: నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం తర్వాత ఆయన మాజీ భార్య ష్యామలీ దే పెట్టిన ఇన్ స్టా పోస్టు చర్చనీయాంశంగా మారింది. వారి వివాహం జరిగిన రాత్రంతా తాను నిద్రపోలేదని, ఏవేవో ఆలోచనలతో గడిపానని భావోద్వేగాలతో నిండిన పోస్టు పెట్టారు. రాజ్ నిడిమోరు ఇటీవల నటి సమంతా రూత్ ప్రభును తమిళనాడులోని ఇషా యోగా సెంటర్, కోయంబత్తూరులో ఆధ్యాత్మిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం తర్వాత రాజ్ కుటుంబ నేపథ్యం పూర్వపరాలపై నెట్టింట జోరుగా వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మాజీ భార్య చేసిన ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చర్చలు లేపింది. ఈ వివాహం తర్వాత ఆమె తన ఫీలింగ్స్ పంచుకుంటూ “నేను గత రాత్రంతా నిద్రపోలేక, ఆలోచనలు చేస్తూ గడిపాను. ఈ క్రమంలో ఎన్నో శుభాకాంక్షలు , కృతజ్ఞతలు వచ్చాయి. వాటిని పట్టించుకోవడం…
సంగతి న్యూస్, చెన్నై: కాంగ్రెస్ పార్టీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీఎర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్షలు చేశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో దేశ రాజకీయాలకు భారంగా మారారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రతిపక్ష హోదాలో కొనసాగలేదని అన్న ఆయన ఇకపై ప్రాంతీయ పార్టీలే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బుధవారం చెన్నైలో శివనాడార్ ఫౌండేషన్ వారి ఇగ్నిషన్ సదస్సుకు హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి దూరదృష్టి కొరవడిందని అందుకే ప్రతిపక్షాన్ని నడిపించడం ఆయనవల్ల కాదన్నారు. ఆర్థిక, ఉద్యోగ, పరిశ్రమలు, అభివృద్ధివంటి అంశాలపై ఇప్పటి వరకు ఆయనకు స్పష్టమైన విధానాలు లేవని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం ప్రధాని మోదీకి బాగా కలిసి వస్తుందన్నారు. దక్షిణాధి రాష్ట్రాల్లో బీజేపీ అడుగు పెట్టడం సాధ్యం కాదని, కచ్చితంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలు ఆ…