Author: admin@sangathi

టీఎంసీ బ‌హిష్కృత ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లుసంగ‌తి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో తాము ‘బాబ్రీ మసీదు’ నిర్మిస్తామని ప్రకటించారు. త‌మ నిర్మాణాన్ని ఏ అధికార‌, రాజకీయ శక్తి అడ్డుకోలేదన్నారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ “ఇది అయోధ్య కాదు. ఇది ముర్షిదాబాద్. ఇది నా సవాలు. ఇక్కడ బాబ్రీ మసీదును ఎవ్వరూ తాకలేరు” అని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చార‌ని, అలాగే 2019లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని, ఆ తీర్పే మసీదును మరోచోట నిర్మించాలనే ఆలోచనకు దారి తీసిందన్నారు. “నాకు బాబర్‌తో ఎలాంటి సంబంధం లేదు. కానీ బాబ్రీ మసీదు పేరు ఇంకా చాలామందిలో బాధను గుర్తు చేస్తోంది. ఎన్నికల…

Read More

సంగ‌తి, న్యూఢిల్లీ: అక్రమ బెట్టింగ్ యాప్ మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్లు, సినీ నటులకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ కేసులో మొత్తం రూ. 7.93 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈడీ వివరాల ప్రకారం, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు చెందిన వైడ‌బ్ల్యూసీ (హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థ ద్వారా రూ. 2.5 కోట్లు, నటి నేహా శర్మ రూ. 1.26 కోట్లు, నటుడు అంకుష్ హజ్రావి రూ. 47.2 లక్షలు, మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పవి రూ. 8.26 లక్షలు, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వి రూ. 1 కోటి, ఇత‌రుల‌వి కొన్ని తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ ప్రముఖులందరినీ గతంలో ఈడీ విచారించిందని, అటాచ్ చేసిన ఆస్తులన్నీ అక్రమ బెట్టింగ్ యాప్ వ‌న్ ఎక్స్ బెట్…

Read More

సంగ‌తి, విజయవాడ: మ‌ద్యం మ‌త్తులో ఓయువ‌కుడు దారుణం చేశాడు. మద్యం కొనడానికి ₹10 ఇవ్వలేదని ఓ వ్యక్తిని 17 ఏళ్ల మైనర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం మద్యం మత్తులో ఉన్న మైనర్ ఒక మద్యం దుకాణం సమీపంలో త‌న‌కు ప‌రిచ‌యం లేని తాతాజీ (49) అనే వ్యక్తిని డబ్బులు అడిగాడు. అత‌డు ఇచ్చేందుకు నిరాక‌రించాడు. దాంతో వారిద్ద‌రి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తాతాజీ మైనర్ పై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్ అక్కడి నుంచి వెళ్లి కత్తి తీసుకొచ్చి మద్యం దుకాణానికి స‌మీపంలో తాతాజీని పొడిచాడు. దాంతో తీవ్ర గాయాలతో తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read More

సంగ‌తి న్యూస్, గోవా: గోవాలోని ఓ నైట్ క్ల‌బ్ లో ఘోర అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఉత్త‌ర గోవాలోని అర్పోరా గ్రామంలోగ‌ల బ‌ర్చ్ బై రోమియో లేన్ లోని ఈ క్ల‌బ్ లో శ‌నివారం అర్థ‌రాత్రి ఎల్పీజీ సిలిండ‌ర్ పేలింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 25మంది మృత్యువాత ప‌డ‌గా వీరిలో ఎక్కువ సంఖ్య‌లో అందులో ప‌నిచేసే సిబ్బంది న‌లుగురు ప‌ర్యాట‌కులు ఉన్న‌ట్లు ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ కుమార్ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. వీరంతా బేస్ మెంట్ విభాగంలో ప‌నిచేస్తుండటంవ‌ల‌న మృత్యువాత ప‌డ్డ‌ట్టు స‌మాచారం. వీరిలో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. వీరిలో మ‌రో ఏడుగురిని ఇంకా గుర్తించ‌లేద‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు శ‌ర‌వేగంగా అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ద‌ర్యాప్తు ప్రారంభించామ‌ని, ఎల్పీజీ పేలుడు వ‌ల‌న ఇలా జ‌రిగింద‌ని, నిర్ల‌క్ష్యంగా ఉన్న య‌జ‌మానుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య తీసుకుంటామ‌న్నారు. గోవా, అగ్ని ప్ర‌మాదం, సీఎం…

Read More

సంగ‌తి స్పోర్ట్స్ విభాగం: ద‌క్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ కు టీమ్ ఇండియా గ‌ట్టిగా బ‌దులిచ్చింది. భార‌త్ ఆట‌గాళ్ల‌ను అవ‌మానించిన‌ట్లు వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌కు తాజా విజ‌యంతో బుద్ధి చెప్పినట్ల‌యింది. లెక్క‌స‌రిపోయిందా అన్నట్లుగా సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా జ‌రిగిన మూడో వండేలో 9 వికెట్ల తేడాతో భార‌త్ తేలిక‌గా ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా గ‌త సిరీస్ సంద‌ర్భంలో షుక్రీ చేసిన వ్యాఖ్య‌లు నెటిజ‌న్లు గుర్తు చేసుకున్నారు. గ‌త రెండు టెస్టుల సిరీస్ ద‌క్షిణాఫ్రికా గెలుచుకున్న సంద‌ర్భంలో మీడియాతో మాట్లాడిన‌ప్పుడు భార‌త క్రికెట‌ర్ల‌ను అవ‌మానించేలా మాట్లాడాడు. ఆ మ్యాచ్‌లో భారత ప్లేయ‌ర్లు ఎక్కువ సేపు త‌మ మొకాళ్ల‌పై మైదానంలోనే ఎదురుచూసేలా చేసేందుకే ఆ మ్యాచ్ ను డిక్లేర్ చేయ‌లేదని వ్యాఖ్యానించారు. ఆ మాట‌లపై నెటిజ‌న్ల‌తోపాటు ప్ర‌ముఖ క్రికెట్ ప్లేయ‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తాజాగా ద‌క్షిణాఫ్రికాను…

Read More

సంగ‌తి న్యూస్, ఇస్లామాబాద్: జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ ఒక‌రినొక‌రు పోటీ ప‌డి తిట్టుకుంటున్నారు. నువ్వు పిచ్చోడివంటే నువ్వు పిచ్చోడివ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇటీవల ఖాన్‌ సోదరి ఆయ‌న‌ను జైలులో క‌లిసిన త‌ర్వాత ఆయన జనరల్ మునీర్‌పై విరుచుకుప‌డ్డాడు. మునీర్ మాన‌సికంగా స‌రిగా లేడ‌ని, పిచ్చివాడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని అన్నారు. పాక్ సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించింది. నిజానికి ఖాన్ “మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి” అని చెబుతూ కుటుంబసభ్యుల భేటీలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా పాక్ సైన్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. పాక్ సైన్య ప్రతినిధి లెఫ్టెనెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ మాట్లాడుతూ ఖాన్‌ను “నార్సిస్ట్” అన్నారు. ఆయనకు అధికారం లేకుంటే దేశమే ఉండ‌కూడ‌ద‌న్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తార‌ని, అంత స్థాయిలో ఆశ‌లు పెరిగిపోయాయ‌ని వ్యాఖ్యానించారు.

Read More

కొత్త సాంగ్ వ‌చ్చిందోచ్సంగ‌తి సినిమా, హైద‌రాబాద్‌: మెగాస్టార్ చిరు మ‌రో కొత్త సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది. శ‌శిరేఖా అంటూ ఆయ‌న ఆనంద ప‌ర‌వ‌శంలో ఆ పాట‌లో తేలిపోతున్నారు. కేర‌ళ కొబ్బ‌రితోట‌ల న‌డుమ న‌దీ జలాలో బోటులో తేలుతూ నేనొక మాట చెబుతా ఫీలుకాక అంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. అనిల్ రావిపుడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు అనే చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే మీసాల పిల్లా అనే సాంగ్ విడుద‌లై నెట్టింట‌ షేక్ చేసి సోష‌ల్ మీడియాలో కూడా దుమ్ము రేపుతోంది. కాగా చిత్ర యూనిట్ రెండో సింగిల్ గా శ‌శిరేఖా అనే సాంగ్ ప్ర‌మో విడుదల చేశారు. ఈ పాట‌లో చెప్పాల‌నుకున్న మాట చెప్పేయ్ మోమాట ప‌డ‌కా అంటూ హీరోయిన్ న‌యాన తార ఆయ‌న‌ను ఎంక‌రేజ్ చేస్తున్నారు. పూర్తి పాట‌ను డిసెంబ‌ర్ 8న విడుద‌ల చేయ‌నుండ‌గా సినిమా సంక్రాంతికి థియేట‌ర్ల‌లో…

Read More

కాంగ్రెస్ పెద్ద‌ల‌పై బీజేపీ ఎంపీసంగ‌తి న్యూస్‌, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌పై బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారి ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. తాము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హాజరుకావ‌డంపై మీకేంటి స‌మ‌స్య అని నిల‌దీశారు. దేశానికి సంబంధించి విదేశాంగ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి భిన్న పార్టీల నాయకులతో అవ‌స‌రం ఉంటుంద‌ని, వారి నైపుణ్యాన్ని కూడా ఉపయోగించుకుంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆప‌రేష‌న్ సింధూర్ విష‌యాన్ని గుర్తు చేశారు. ఆ స‌మయంలో బహుళపక్ష ప్రతినిధులు కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించిన మనోజ్ తివారి “అనేక మంది అనుభవజ్ఞులు, ఇతర పార్టీలకు చెందినవారు కూడా, ప్రభుత్వ విదేశాంగ ప్రయత్నాలకు సహకరిస్తున్నారు. శశి థరూర్ కూడా వారిలో ఒకరు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకత్వానికి ఎందుకు ఇబ్బంది అవుతుందో నాకు అర్థం కావడం లేదు.” అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ నాయకులు…

Read More

సంగ‌తి న్యూస్, న్యూఢిల్లీ: ఇండిగో విమాన స‌ర్వీసుల ర‌ద్దు.. ఆల‌స్యంపై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. మూడు రోజుల్లోగా ఈ స‌మ‌స్య‌ను తీర్చాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఘ‌ట‌న‌ల‌కు బాధ్యులెవ‌రు.. ఎలా జ‌రిగింద‌నే విష‌యాన్ని నిగ్గు తేల్చేందుకు ఉన్న‌త స్థాయి క‌మిటీని వేసింది. ఈ మేర‌కు పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ఒక ప్ర‌క‌ట‌న చేశారు. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో.. ఎవ‌రు చేశారో తేల్చిన త‌ర్వాత ద‌ర్యాప్తు ఆధారంగా బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ప్ర‌యాణికుల అవ‌స్థ‌లుఇండిగో విమాన స‌ర్వీస‌లు ఎంచుకున్న ప్ర‌యాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయి న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. త‌మ వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవ‌డంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అనూహ్యంగా ఇత‌ర విమాన స‌ర్వీసుల టికెట్ రేట్లు కూడా అమాంతం పెరిగిపోవ‌డంతో ఆ భారం మోయ‌లేక త‌మ ఇళ్ల‌కు వెళ్ల‌లేక అక్క‌డే ఉండిపోతున్నారు. ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి రావాలంటే ఐదు…

Read More

సంగ‌తి న్యూస్, న్యూయార్క్ : శాంతి దూత‌న‌ని, త‌న‌కు క‌చ్చితంగా నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని బ‌హిరంగంగానే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెర‌వేరింది. ఎట్ట‌కేల‌కు ఆయ‌నకు త‌న క‌ల‌ల బ‌హుమ‌తి శాంతి అవార్డు వ‌చ్చింది. ఫిఫా తాజాగా ప్రవేశపెట్టిన ఫిఫా పీస్ ప్రైజ్‌నును ఆయ‌న‌ శుక్రవారం 2026 వరల్డ్ కప్ డ్రా కార్యక్రమంలో అందుకున్నారు. గాజాలో శాంతి స్థాప‌న చేసినందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్న‌ట్లు ఫిఫా అధ్య‌క్షుడు జియాన్ని ఇన్పాంటినో ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ట్రంప్కు ఇన్ఫాంటికో సాన్నిహిత్య సంబంధం ఉంది. గ‌తంలో కూడా ఆయ‌న ట్రంప్ నోబెల్ బ‌హుమ‌తికి అర్హుడ‌ని బాహ‌టంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. గాజాలో కాల్పుల విర‌మ‌ణ కోసం ట్రంప్ ఎంతో కృషి చేశార‌ని అందుకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా శాంతి–ఐక్యత కోసం చేసిన సేవలకు ఈ పుర‌స్కారం అందించామ‌ని తెలిపారు ఇన్ఫాంటినో మాట్లాడుతూ, “మనం కోరుకునే నాయకుడు ఈయ‌నే..ఈయ‌న ప్రజల కోసం పనిచేసే…

Read More