సంగతి, అంతర్జాతీయం: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తాను గతంలో హెచ్చరించినట్లుగానే నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికా బలగాలతో దాడులు చేయించారు. గురువారం ఆ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అమెరికా విడుదల చేసింది. నైజీరియాలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను నిరోధించేందుకే తాము ఈ దాడులు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఓ సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. “ఐసిస్ ఉగ్రవాదులపై మేం శక్తిమంతమైన దాడులు చేశాం. అమాయకులైన క్రైస్తవులపై దాడులకు ప్రతిగా మేం ఈ దాడులు చేశాం. వారిని దారుణంగా చంపడం ఆపకపోతే నేను నరకం చూపిస్తానని ముందే హెచ్చరించాను. కానీ వారు పట్టించుకోలేదు. తీవ్ర ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అసలు సహించను. ఇప్పుడు వారు ఈ దాడులు వారు అనుభవించాల్సిందే. చనిపోయిన ఉగ్రవాదులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు” అని ఆయన రాసుకొచ్చారు.
Author: admin@sangathi
సంగతి, భద్రాద్రికొత్తగూడెం: మిస్ టీన్ తెలంగాణగా భద్రాద్రి జిల్లా అమ్మాయి నిలిచింది. రాజస్థాన్‌లో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన ఫేవరెట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీల్లో భద్రాచలం పట్టణానికి చెందిన ప్రీతి యాదవ్ నిలిచింది. పట్టణానికి చెందిన ప్రకాశ్ యాదవ్, రేణు దంపతుల కుమార్తె ప్రీతి. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆమె తండ్రి పానీపూరి బండి నడుపుతుండగా తల్లి రేణుకు మోడలింగ్ రంగంపై అనుభవం ఉంది. దీంతో తన కుమార్తెను మోడలింగ్ పోటీలకు సిద్ధం చేసేది. ఈ పోటీలకు ఏడాది క్రితమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలవగా దేశవ్యాప్తంగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
. నీకు నీ కుటుంబానికి అధికారం రానివ్వ. నా తోలు తీసుడు కాదు.. నిన్నే చీరతరు. కొడంగల్ సభలో కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ సంగతి, కొడంగల్: కేసీఆర్ (కే చంద్రశేఖర్ రావు), కల్వకుంట్ల కుటుంబానికి అధికారం దక్కడం ఇక కలే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో కూడా తామే విజయం సాధిస్తామని సవాల్ విసిరారు. కొడంగల్ నియోజక వర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ల కోసం బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.”కేసీఆర్ మంచి చెబుతాడని అనుకున్న. నాపై 181 కేసులు పెట్టారు. కుటుంబాన్ని వేధించాడు. ఇవన్నీ పట్టించుకుంటే రాష్ట్రం ఆగమైతదని నేను పట్టించుకోలే. ఆయనకు ఆయనే జైలులో ఉన్నట్లు తన ఫాం హౌజ్‌లో నే ఉంటున్నా నేను ఏమి అనలేదు. ఇక ప్రత్యేకంగా జైలు కూడా అక్కర్లేదు అనుకున్న. ఒక్కరిపై కూడా కక్ష పూరిత రాజకీయాలు చేయలేదు. పైన…
సంగతి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాలి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోగా అందులోని 13 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది కాలిన గాయాలతో బయటపడినప్పటికి వారి పరిస్థితి విషమంగా ఉంది.బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా గోర్లతు అనే గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు-హెబ్బులి జాతీయ రహదారిపై ఈ సంఘటన నెలకొంది. ఈ ఘటనలో ట్రక్కు కూడా పూర్తిగా కాలి బూడిదైంది. మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చిత్రం :శంబాలహీరో హీరోయిన్: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్‌సంగీతం : శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: యుగంధర్ ముని, విడుదల: 25.12.2025 ఎంతో కాలంగా విజయాన్ని ముద్దాడాలని ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ ఖాతాలో విజయం పడిందేమో తెలుసుకోవాలని ఉందా ఈ రివ్యూ చూడండి. కథ:వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఊరు శంబాల. ఆ ఊర్లో ఆకాశం నుంచి ఓ ఉల్క రాలి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరు విచిత్రంగా ప్రవర్తించడం, హత్యలు, ఆత్మహత్యలు అవుతుంటాయి. దాంతో ఆ ఊరి జనాలు తమ ఊరిని ఏదో భూతం ఆవరించిందని భయపడిపోతుంటారు. ముఖ్యంగా గ్రామం మొత్తం మూఢనమ్మకాలు తాండవిస్తాయి. దాంతో అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలని, అక్కడి రహస్యాలు గుర్తించాలని ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్తను పంపిస్తుంది. అయితే, కేవలం సైన్స్‌నే నమ్ముకున్న అతడు ఆ ఊరి రహస్యాలను ఛేధించాడా, ఆ…
సంగతి, టెక్నాలజీ: గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ఈఎల్ఎస్)లను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ఇండియాలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వినియోగదారులు అత్యవసర సేవలు పొందే అవకాశం ఏర్పడనుంది. పోలీసు, వైద్యం, అగ్నిమాపక వంటి సేవలకోసం వినియోగదారుడు ప్రయత్నించినప్పుడు నేరుగా అతడి లొకేషన్ కూడా సేవలు అందించేవారికి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల ఉపయయోగిస్తుండగా ఆయా రాష్ట్రాల్లోకి కూడా అందుబాటులోకి రానుంది. కాకపోతే ముందుగా ఆయా ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలతో ఈ ఫీచర్‌ను అనుసందించాల్సి ఉంటుంది. సడెన్ గా ఫోన్ కట్ అయినా కూడా జీపీఎస్, వైఫై, నెట్ వర్క్ ఆధారంగా ఈ ఫీచర్ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ అవసరం లేదని గూగుల్ ప్రకటించింది. అలాగే వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని కూడా తాము సేకరించబోమని తెలిపింది. నిరభ్యంతరంగా ఎలాంటి అనుమానాలు లేకుండా…
ఆ పదాలు వాడటం తప్పేఉద్దేశం మాత్రం మంచిదని వివరణ సంగతి, సినిమా: ఎట్టకేలకు హీరో శివాజీ తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళలను ఉద్దేశించి చెప్పిన మాటలు ఇబ్బంది పెట్టేలా అవమాన పరిచేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. నిండుగా వస్త్రాలు ఉంటే మంచిదని సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోవద్దని ఆయన చేసిన కామెంట్లు పలువురు సినీ నటీమణులు, మహిళాలోకం సామాజిక మాధ్యమాల, ఇతర వార్తా చానెళ్లలో తీవ్రంగా విమర్శించారు. కొందరు ఆయనను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆయన మంగళవారం సాయంత్రం స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..”దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడిన సందర్భాల్లో నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో చెబుతూనే రెండు ఉపయోగించకూడని పదాలు(అన్ పార్లమెంటరీ వార్డ్స్)…
సంగతి, వాషింగ్టన్ : అమెరికా న్యాయశాఖ వెబ్ సైట్ నుంచి అత్యంత కీలకమైన ఫొటోలు మాయమయ్యాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టేలా ఉన్న ఆ ఫోటో పబ్లిక్ డొమైన్‌లో శుక్రవారం కనిపించగా ఒక్కరోజులోనే తొలగించబడ్డాయి. అయితే, అక్కడి పౌర సమాజం ఆ ఫోటోలను ఎందుకు తొలగించారని, సాంకేతిక సమస్యనా లేక అధ్యక్షుడి సీక్రెట్ లైఫ్ బయటపడుతుందనా అని ప్రశ్నించుకుంటున్నారు.ఇంతకీ ఏమిటీ ఈ ఫొటోలు 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తిపై సెక్స్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. అతడు అరెస్టయిన తర్వాతజైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విచారణలో భాగంగా అతడి వద్ద నుంచి విచారణ సంస్థలు వేల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళల నగ్న మహిళల చిత్రాలపెయింటింగ్స్, మరో ఫోటోలో డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్, మెలానియా ట్రంప్ మరియు గిస్లైన్ మ్యాక్స్వెల్ కలిసి ఉన్న దృశ్యంలాంటివి ఉన్నాయి. వీటిని అక్కడి అధికారుల ఆదేశాల మేరకు న్యాయశాఖ పబ్లిక్ డొమైన్‌లో…
సంగతి, స్పోర్ట్స్ : తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ ట్వంటీలో భారీ స్కోర్ రాబట్టింది. తిలక్ (73), హార్దిక్ (63) పరుగులు, ఓపెనర్లుగా దిగిన అభిషేక్(34), శాంసన్ (37) పరుగులతో టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు 232 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. ఇండియా గెలిస్తే కప్పు సొంతం అవుతుంది.
విద్య విషయంలో కేంద్రం రాష్ట్ర స్థాయిలో ఈ మధ్య చర్చ జరగడం మంచి పరిణామం. మరి ముఖ్యంగా పాఠశాల మౌలిక సదూపాయాల నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అనే అంశాలు ముఖ్యాంశాలుగా చర్చకు వస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దలు ఉపాద్యాయులు అసలు నేర్చుకోవడం మానేశారని పరోక్షంగా చురకలు అంటించడం నుంచి వారికి శిక్షణతోపాటు పరీక్షలు పెట్టాలనే మాటలు చెబుతూనే వారి సేవలు మరువలేనివి అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఉపాధ్యాయలోకంపట్ల వారికి ఆందోళన ఉన్నదన్నది వాస్తవమే. అయితే, మరి తమ ఆందోళనను పట్టించుకునే నాథుడు ఏడి అనేది ఉపాధ్యాయుల మనోగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరమపవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఆయన వ్యక్తులను తయారు చేస్తాడు. వీరంతా వారి మెదడుకు పుడతారు. ఇది కాదనలేము. ఉపాధ్యాయులపై చులకన భావంచాలా విషయాలు ఉపాధ్యాయుల మనసులను తొలుస్తున్నాయి. సామాన్య పౌరుడి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులకు ఉపాద్యాయులంటే చులకన భావం ఏర్పడిందనేది తొలి…