సంగతి, హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ప్రజలను భయపెట్టే పోస్టులను పెట్టొద్దని స్పష్టం చేశారు. బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్నాచింగ్ చేసేందుకు పొరుగు రాష్ట్రాలనుంచి దొంగలు మకాం వేశారని వదంతులు రావడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయనేమన్నారంటే.. “బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండి.నిశ్చింతగా ఉండండి. మీ భద్రతే…
Author: admin@sangathi
కర్ణాటకలో డీజీపీ రేంజ్ అధికారి నిర్వాకంతాను కాదంటున్న సదరు అధికారిసంగతి, బెంగళూరు: డీజీపీ ర్యాంకు ఐపీఎస్ అధికారి వివాదంలో చిక్కుకున్నారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలతో అనుచితంగా ఉన్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడ తీవ్ర చర్చకు దారి తీస్తుంది. పలువురు నెటిజన్లు సోషల్ మీడియాల్లో కామెంట్లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో సీనియర్ పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే రామచంద్రరావు తన కార్యాలయంలో సన్నిహితంగా కొంతమందితో ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తుంది. వీటిని ఎవరో ఆయనకు తెలియకుండా తీసినట్లు అగుపిస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయానికి ఫిర్యాదుకు వెళ్లగా ఆయన విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే నిజమని తేలితే ఆయనపై చర్యలు కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా అది తాను కాదని, తన ఫొటోను ఎవరో మార్పింగ్ చేశారని అంటున్నారు.
చక్కటి విద్యావసతి, నాణ్యమైన భోజనంహుజూర్‌నగర్ టీజీఎస్‌డబ్ల్యూఆర్ ఎస్ ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లుసంగతి, హుజూర్ నగర్: ఐదో తరగతిలో గురుకులాల్లో ప్రవేశించేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు 6,7,8,9 తరగతుల్లో ఆయా గురుకులాల్లో ఉన్న బ్యాక్‌లాగ్ ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 2026-27 ప్రవేశాలను విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి పూర్తి చేయాలని సంక్షేమ గురుకుల సొసైటీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు ఈసారి ఆలస్యం కావొద్దని ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలో 637 గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,408 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11న ప్రారంభం కాగా గడువు జనవరి 21తో ముగుస్తుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా చేరిన…
సంగతి, అంతర్జాతీయం: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన శత్రు దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. తమ దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే సహించేది లేదన్నారు. ఏ విధంగానైతే వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తమ సైన్యం బంధించిందో మిగితా దేశాల నాయకులకు కూడా అదే గతి పడుతుందని మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాలు తమ దేశంలోకి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాయని, అనేక గ్యాంగ్ లకు ఆ దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయని పద్ధతి మార్చుకోకపోతే వెనెజులా లాంటి పరిస్థితి చవి చూస్తారని హెచ్చరించారు. అవసరం అయితే, ఆయా దేశాల్లో డ్రగ్స్ తయారీ కేంద్రాలపై తమ బలగాలతో దాడి చేసేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ చెప్పారు. ఇప్పటికే అమెరికా ప్రత్యేక కమాండోలు వెనెజులాలోని కారకాస్‌లో ఆపరేషన్ చేపట్టి నకోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చర్యను కొలంబియా, క్యూబా దేశాలు…
సంగతి, సినిమా : దళపతి విజయ్ చిత్రం జన నాయగన్ ట్రైలర్ వచ్చేసింది. ఫుల్ మాస్ లుక్‌లోనే స్టైలిష్ డైలాగ్ డెలివరీతో అదిరిపోయింది. జన నాయకుడు గా తెలుగులో విడుదల కానున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకం పై వెంకట్ కే నారాయణ నిర్మించారు. బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక విలన్ పాత్ర పోషిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు, సొసైటీ పట్ల బాధ్యతగల వ్యక్తిగా, కూతురుని మిలిటరీకి సిద్ధం చేసే తండ్రిగా, రాజకీయాల్లోకి అడుగుపెట్టి శుద్ధి చేసేవాడిగా భిన్న శైలిలో ఈ పాత్ర కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఒక మాస్ ఎంటర్ ట్రైనర్‌గా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతున్నది స్పష్టమవుతోంది. విజయ్ నట…
సంగతి, సినిమా: ఈ వారం మీకోసం పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పలు ప్రపంచ వ్యాప్త చిత్రాలతోపాటు సిరీస్‌లు కూడా ఓటీటీలో సిద్దమయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ కొత్త సంవత్సరంలో మీకు నచ్చిన ఈ చిత్రాలు ఆయా ఓటీటీ ప్లాట్ ఫాంలలో చూసేయండి..ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే.. మౌగ్లీ: ఈటీవీ విన్‌తెలుగులో రొమాంటిక్ యాక్షన్ ఎడ్వంచర్‌గా తెరకెక్కిన చిత్రం మోగ్లీ. ఇది ఈటీవీ విన్‌లో జనవరి 1, 2026న విడుదలైంది. అడవుల్లో పెరిగిన మురళి అనే యువకుడు జాస్మిన్ అనే నర్తకితో ప్రేమలో పడి ఓ క్రూరమైన అటవీ అధికారి కారణంగా ఎలా మలుపు తిరిగిందన్నదే కథ. బ్యూటీ-జీ 5 అలేఖ్య అనే యువతి తనతోపాటు చదువుకుంటున్న అర్జున్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత అతడి గురించి తెలుసుకునే విషయాలు పలు అనుమానాలతో థ్రిల్లర్ మూవీలాగా కనిపిస్తుంది. ఈ చిత్రం…
సంగతి, హైదరాబాద్: ఇటీవల తల్లిదండ్రుల చేతిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపట్ల హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. చిన్నారులు తల్లిదండ్రుల చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసినట్లు ఆయన మానవతా దృక్పథంలో స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన తన భావాలను భావోద్వేగంతో ఇలా పంచుకున్నారు. “నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం. చనిపోవడానికి ఉన్న ధైర్యం..…
సంగతి, సినిమా: మరోసారి రెబల్ స్టార్ సునామీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. అందులో ఆనందంగా ఈదేందుకు ప్రేక్షకులు సిద్ధమంటున్నారు. జనవరి 9, 2026 సంక్రాంతి సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ చిత్రం వెండితెరను వెలిగించనున్న విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తుండగా ప్రేక్షకులకు మరింత పూనకాలు వచ్చేలా చిత్ర యూనిట్ రాజాసాబ్ 2.0పేరిట రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీంతో యూట్యూబ్, సోషల్ మీడియా దుమ్మురేపుతోంది. కొందరు ఫ్యాన్స్ అయితే, అప్పటి వరకు ఆగలేమని కొందరు, సంక్రాంతి అప్పుడే వచ్చేసిందని కొందరు ఆనందపరవశంతో ఊగిపోతున్నారు. ఈ ట్రైలర్ విడుదలయ్యాక మారుతీని మరింత భుజాలపై ఎత్తుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ట్రైలర్ ప్రకారం మంచి హర్రర్, కామెడీ టైమింగ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసే సెంటిమెంట్ కూడా పుష్కలంగా డైరెక్టర్ పెట్టాడని తెలుస్తోంది. సెంటిమెంట్ సన్నివేశాలు ప్రభాస్ ఎలా పండిస్తాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు…
సంగతి, నీతి సుధ: మనుషులకు ప్రతీది కొలమానంగా చూడటం, ఎక్కువ తక్కువలు నిర్ణయించడం అలవాటు. బేరీజు వేసుకొని మరీ ప్రతి పని చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చేదానిని గౌరవించడం, తక్కువ దానిని చిన్న చూపు చూడటం చేస్తారు. కానీ వాస్తవానికి దేనికదే ప్రత్యేకమైనదే దృష్టి నేటి సమాజానికి కలగదు. దేనికి ఉండే విలువ దానికి ఉంటుందని, దేనిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం అత్యంత తేలికగా అర్థమయ్యేందుకు తేలికైన మాటల్లో వేమనగారు చక్కటి పద్యాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడా పద్యం అందులోని నీతి మీకోసం.. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబుకొంచెమైన నదియు కొదువ కాదువిత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతవిశ్వదాభిరామ వినురవేమ భావం: మఱ్ఱి చెట్టుకు గింజ చాలా చిన్నగా ఉంటుంది. ఆ విత్తనం నుండే మనం మహావృక్షం పుట్టడం చూస్తాము. అలాగే మంచి మనసుతో చేసిన మంచి పని…
సంగతి, గురుగ్రామ్: తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని ఓ యువకుడు ఓ వివాహితను హత్య చేయబోయాడు. క్లబ్‌లో పనిచేస్తున్న 25 ఏళ్ల వివాహిత మహిళపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో డిసెంబర్ 20 అర్ధరాత్రి ఎంజీ రోడ్‌లోని ఓ క్లబ్‌లో చోటు చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. తొలుత కాల్పులకు గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా వాంగ్మూలం ఇవ్వలేక పోయింది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భార్య కల్పన (25) గురుగ్రామ్‌లోని ఓ క్లబ్‌లో పనిచేస్తోందని, సంగమ్ విహార్ (ఢిల్లీ) నివాసి తుషార్ ఆమెపై కాల్పులు జరిపినట్లు చెప్పాడు. డిసెంబర్ 19న తన భార్య పని కోసం వెళ్లిందని, రాత్రి సుమారు 1 గంట సమయంలో ఫోన్ చేసి తనపై కాల్పులు జరిగాయని తెలిపిందని భర్త వివరించాడు.“ నెల రోజుల క్రితం తుషార్ మా ఇంటికి వచ్చి మాతో గొడవపడి వెళ్లాడు,” అని ఫిర్యాదుదారు తెలిపారు.…