అమరావతి: సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పవన్ కల్యాణ్, లోకేశ్ సంతాపం
సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. యాత్రికులతో వెళ్తోన్న బస్సు.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. (Andhra Pradesh News)
