ఆంధ్రప్రదేశ్ :
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కావడంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విముఖత చూపించారు. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరగా, సీబీఐ ప్రత్యేక కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టంగా ఆదేశించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21న సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో బెయిల్పై ఉన్న సమయంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు కోర్టు ఆయనకు హాజరు మినహాయింపు ఇచ్చింది. అయితే, పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆయన మళ్లీ కోర్టు ముందుకు వెళ్లనున్నారు.
ఈ పరిణామంపై వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కోర్టు తదుపరి చర్య ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
