సంగతి, విజయవాడ: మద్యం మత్తులో ఓయువకుడు దారుణం చేశాడు. మద్యం కొనడానికి ₹10 ఇవ్వలేదని ఓ వ్యక్తిని 17 ఏళ్ల మైనర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న మైనర్ ఒక మద్యం దుకాణం సమీపంలో తనకు పరిచయం లేని తాతాజీ (49) అనే వ్యక్తిని డబ్బులు అడిగాడు. అతడు ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తాతాజీ మైనర్ పై చేయిచేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్ అక్కడి నుంచి వెళ్లి కత్తి తీసుకొచ్చి మద్యం దుకాణానికి సమీపంలో తాతాజీని పొడిచాడు. దాంతో తీవ్ర గాయాలతో తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Add A Comment
