చక్కటి విద్యావసతి, నాణ్యమైన భోజనం
హుజూర్నగర్ టీజీఎస్డబ్ల్యూఆర్ ఎస్ ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లు
సంగతి, హుజూర్ నగర్: ఐదో తరగతిలో గురుకులాల్లో ప్రవేశించేందుకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు 6,7,8,9 తరగతుల్లో ఆయా గురుకులాల్లో ఉన్న బ్యాక్లాగ్ ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 2026-27 ప్రవేశాలను విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి పూర్తి చేయాలని సంక్షేమ గురుకుల సొసైటీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని, ఇంటర్, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు ఈసారి ఆలస్యం కావొద్దని ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల సొసైటీల పరిధిలో 637 గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,408 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11న ప్రారంభం కాగా గడువు జనవరి 21తో ముగుస్తుందని తెలిపారు. ప్రవేశ పరీక్ష ద్వారా చేరిన విద్యార్థులకు తమ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులచే ఉచిత విద్యా బోధన సౌకర్యం, నాణ్యమైన పౌష్టికాహారం, దుస్తులు, షూ, పుస్తకాలు తదితరమైనవి ఉచితంగా అందించనున్నట్లు, ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Add A Comment
