సంగతి, సినిమా : దళపతి విజయ్ చిత్రం జన నాయగన్ ట్రైలర్ వచ్చేసింది. ఫుల్ మాస్ లుక్‌లోనే స్టైలిష్ డైలాగ్ డెలివరీతో అదిరిపోయింది. జన నాయకుడు గా తెలుగులో విడుదల కానున్న ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకం పై వెంకట్ కే నారాయణ నిర్మించారు.
బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక విలన్ పాత్ర పోషిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు, సొసైటీ పట్ల బాధ్యతగల వ్యక్తిగా, కూతురుని మిలిటరీకి సిద్ధం చేసే తండ్రిగా, రాజకీయాల్లోకి అడుగుపెట్టి శుద్ధి చేసేవాడిగా భిన్న శైలిలో ఈ పాత్ర కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఒక మాస్ ఎంటర్ ట్రైనర్‌గా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతున్నది స్పష్టమవుతోంది. విజయ్ నట విశ్వరూపాన్ని మరోసారి ఈ ట్రైలర్లో ఓ లుక్కేయండి.
Add A Comment
