సంగతి, టెక్నాలజీ: గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ఈఎల్ఎస్)లను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా ఇండియాలోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వినియోగదారులు అత్యవసర సేవలు పొందే అవకాశం ఏర్పడనుంది. పోలీసు, వైద్యం, అగ్నిమాపక వంటి సేవలకోసం వినియోగదారుడు ప్రయత్నించినప్పుడు నేరుగా అతడి లొకేషన్ కూడా సేవలు అందించేవారికి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల ఉపయయోగిస్తుండగా ఆయా రాష్ట్రాల్లోకి కూడా అందుబాటులోకి రానుంది.
కాకపోతే ముందుగా ఆయా ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలతో ఈ ఫీచర్ను అనుసందించాల్సి ఉంటుంది. సడెన్ గా ఫోన్ కట్ అయినా కూడా జీపీఎస్, వైఫై, నెట్ వర్క్ ఆధారంగా ఈ ఫీచర్ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ అవసరం లేదని గూగుల్ ప్రకటించింది. అలాగే వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని కూడా తాము సేకరించబోమని తెలిపింది. నిరభ్యంతరంగా ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ ఫీచర్ సేవలు అందిస్తున్నదని స్పష్టం చేసింది.
Add A Comment
