సంగతి న్యూస్, ఇస్లామాబాద్: జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ ఒకరినొకరు పోటీ పడి తిట్టుకుంటున్నారు. నువ్వు పిచ్చోడివంటే నువ్వు పిచ్చోడివని తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఖాన్ సోదరి ఆయనను జైలులో కలిసిన తర్వాత ఆయన జనరల్ మునీర్‌పై విరుచుకుపడ్డాడు. మునీర్ మానసికంగా సరిగా లేడని, పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు.
పాక్ సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించింది. నిజానికి ఖాన్ “మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి” అని చెబుతూ కుటుంబసభ్యుల భేటీలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా పాక్ సైన్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. పాక్ సైన్య ప్రతినిధి లెఫ్టెనెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ మాట్లాడుతూ ఖాన్‌ను “నార్సిస్ట్” అన్నారు. ఆయనకు అధికారం లేకుంటే దేశమే ఉండకూడదన్నట్లు ప్రవర్తిస్తారని, అంత స్థాయిలో ఆశలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.
Add A Comment
