సంగతి న్యూస్, న్యూయార్క్ : శాంతి దూతనని, తనకు కచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగానే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆయనకు తన కలల బహుమతి శాంతి అవార్డు వచ్చింది. ఫిఫా తాజాగా ప్రవేశపెట్టిన ఫిఫా పీస్ ప్రైజ్నును ఆయన శుక్రవారం 2026 వరల్డ్ కప్ డ్రా కార్యక్రమంలో అందుకున్నారు. గాజాలో శాంతి స్థాపన చేసినందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్పాంటినో ప్రకటించారు.
వాస్తవానికి ట్రంప్‌కు ఇన్ఫాంటికో సాన్నిహిత్య సంబంధం ఉంది. గతంలో కూడా ఆయన ట్రంప్ నోబెల్ బహుమతికి అర్హుడని బాహటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గాజాలో కాల్పుల విరమణ కోసం ట్రంప్ ఎంతో కృషి చేశారని అందుకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా శాంతి–ఐక్యత కోసం చేసిన సేవలకు ఈ పురస్కారం అందించామని తెలిపారు ఇన్ఫాంటినో మాట్లాడుతూ, “మనం కోరుకునే నాయకుడు ఈయనే..ఈయన ప్రజల కోసం పనిచేసే నాయకుడు” అని ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్ మెడలో బంగారు పతకాన్ని వేసి, బంగారు శాంతి ట్రోఫిని అందించారు. ఈ సందర్భంగా
“ఇది నా జీవితంలో గొప్ప గౌరవాలలో ఒకటి” అని ట్రంప్ అన్నారు.
Add A Comment
