సంగతి న్యూస్ టీం, హైదరాబాద్: తన అభినయంతో తెలుగు, తమిళమే కాకుండా యావత్తు దేశంలోని ప్రేక్షకులను కట్టిపడేసి మహానటిగా పేరు తెచ్చుకున్న సావిత్రి పుట్టిన రోజు నేడు (డిసెంబర్- 6).పలు చిత్రాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిత్వంలో చాలా గొప్పది. తాను నటించిన చిత్రాల ద్వారా పెద్ద మొత్తంలో సంపద వచ్చినా అవన్నీ కూడా దానధర్మాలు చేసి నిరాడంబరాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. నటనలో ఆమె ఏ విధంగా దిగ్గజ స్థానమో అంతటి సౌమ్యురాలు. డిసెంబర్ 6, 1936 జన్మించిన ఆమె డిసెంబర్ 26, 1981లో కన్నుమూశారు. ఈమె స్వస్థలం గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ఆమె పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చేతిలో పెరిగింది. చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి అడుగుపెట్టి హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. తర్వాత మద్రాసులో అడుగుపెట్టి సినిమాలో తన ప్రస్థానం ప్రారంభించిఅగ్ర కథానాయికగా ఎదిగింది.
దాదాపు 138 తెలుగు చిత్రాలు, 100 తమిళ చిత్రాలు, 6 కన్నడ చిత్రాలు, 5 హిందీ చిత్రాలు మరియు 3 మలయాళ చిత్రాలలో నటించిన ఆమె 252 చిత్రాలను నిర్మించింది. ముప్పై ఏళ్లపాటు చిత్ర పరిశ్రమలో రారాణిగా వెలుగొందింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసిన ఆమెకు నడిగర్ తిలగం అనే బిరుదు కూడా ఉంది. అప్పటికే ఇద్దరు భార్యలున్న తమిళ నటుడు జెమిని గణేశన్ వివాహం చేసుకోగా విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ కుమారులు జన్మించారు. తదనంతరం కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒకప్పుడు బాగా బతికిన ఆమె చివరి దశలో పేదరికంతో అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 ఏళ్లకే కన్నుమూశారు. సావిత్రి గుర్తొస్తే తెలుగువారికి ఎంత గొప్పనటిగా గుర్తొస్తారో.. ఆమె కన్నుమూసిన తీరు చూస్తే అంతే కన్ను చెమ్మారుస్తారు. ఇలాంటి మహానటి మరోసారి జన్మించాలని మనసారా కోరుకుంటూ జయంతికి నమస్సులు తెలియజేస్తుంది సంగతి న్యూస్ టీం.
Add A Comment
