సంగతి స్పోర్ట్స్ న్యూస్: రెండో వన్డేలో టీమిండియా దక్షిణాఫ్రికాతో పరాజయం పాలైన నేపథ్యంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మొహమ్మద్ షమీని వన్డే జట్టులో పక్కకు పెట్టడంపై ఆయన భేదాభ్రియాలు వెలిబుచ్చారు. “షమీ ఎక్కడ? ఎందుకు ఆడించడం లేదు? అతడు మంచి బౌలర్ ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. షమీ వంటి అనుభవజ్ఞుల్ని పక్కన పెట్టడంతో బౌలింగ్ దెబ్బతిన్నది,” అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు.
“ప్రసిద్ధ్ మంచి బౌలర్ . కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. మీ వద్ద మంచి బౌలర్లు ఉన్నారు, కానీ వారిని పక్కన పెట్టేశారు. బుమ్రా ఉంటే ఈ బౌలింగ్ ఒకలాగ లేకపోతే మరోలాగా అవుతుంది. బుమ్రా లేకపోయినా గెలిచేలాగ జట్టు తయారుకావాలి” అంటూ వ్యాఖ్యానించారు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ పెట్టిన 358 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్రికా 4 వికెట్లతో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పలు విమర్శలు సెలక్టర్లపై వస్తున్నాయి.
