సంగతి న్యూస్, ముంబై: అనూహ్యంగా అఖండ-2 సినిమా వాయిదాపడి అభిమానులంతా నిరుత్సాహంలో ఉండగా వారికి పండగ లాంటి వార్తొకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ సినిమా పూనకాలే అన్నట్లుగా ఉందని ప్రముఖ మూవీ క్రిటిక్ ఉమేర్ సంధూ రివ్యూ ఇచ్చారు. తాను అఖండ-2 చూశానని, ఇది పక్కా పైస్ వసూల్ మాస్ ఎంటర్ టైన్ చిత్రమన్న ఆయన బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి పండగే అని తన ఎక్స్ వేదికలో రాసుకొచ్చాడు.
ఇందులోని భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయని, గుక్క తిప్పుకోలేని డైలాగ్స్, మరియు విజిల్స్ కొట్టించే క్లైమాక్స్ ఉందని చెబుతూ 5కి 3స్టార్ రేటింగ్ ఇచ్చారు. ప్రతి చిత్రం సెన్సార్ పూర్తవగానే ముందు రివ్యూలు ఉమేర్ ఇచ్చే విషయం తెలిసిందే. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వలన అఖండ-2 చిత్రం తెలుగు ప్రాంతాల్లో ముందు ప్రీమియర్ లు తర్వాత చిత్ర విడుదలనే రద్దు చేశారు. త్వరలో ఈ చిత్ర విడుదలను ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Add A Comment
