సంగతి న్యూస్, సిద్ధిపేట: గ్రామాల్లో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది. సామాన్య వ్యక్తి నుంచి గ్రామాల్లో ఆధిపత్యం చూపించే పెద్దల వరకు తమ తమ స్థాయిలో జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఎవరి స్థాయికి తగినట్లు వారు వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఉచిత హామీలకు లెక్కే లేదు. అయితే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సైతం తానేం తక్కువ కాదన్నట్లు ఓ వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వార్డు మెంబర్ గా పనిచేస్తున్న తన భార్యను గెలిపిస్తే ఆ వార్డులోని పురుషులందరికి ఉచితంగా జుట్టు కత్తిరిస్తానని(హెయిర్ కటింగ్) చేస్తానని ప్రకటించాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ ప్రకటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం, రఘోత్తంపల్లి గ్రామంలో వెలువడింది. కటింగ్, షేవింగ్ తోపాటు వార్డును కూడా తాను అభివృద్ధి చేస్తానంటున్నాడు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్న నేటి రోజుల్లో తన వృత్తిని తన భార్య విజయం కోసం వెచ్చిస్తానడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Add A Comment
