సంగతి న్యూస్, న్యూఢిల్లీ: తనకంటే అందంగా ఉన్నారని పూనమ్ అనే మహిళ చిన్నారులపట్ల దారుణాలకు పాల్పడింది. మేన కోడలయిన విధి అనే ఆరేళ్ల పాపను నీటిడబ్బాలో ముంచి చంపింది. అంతకు ముందు కూడా మరో ఇద్దరు కోడళ్లను ఇలాగే చంపినట్లు తెలుస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన హర్యానాలోని పానీపట్‌లో జరిగింది. 2021లో తాజాగా చనిపోయిన పాపపైనే వేడి వేడి టీ పోసి చంపేందుకు ప్రయత్నించిందని, ఆ సమయంలో అది ప్రమాదం వలన జరిగిందని కుటుంబ సభ్యులు భావించారని పోలీసులు తెలిపారు.
2023లో తన సొంత కుమారుడిని కూడా హత్య చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం, ఈ హత్యలకు ‘బ్యూటీ కంప్లెక్స్’ అంటే తనకన్నా అందంగా ఉన్న చిన్నారులను చూసి ఈర్ష్యతో దాడి చేయడమని చెబుతున్నారు. తాజాగా ఓ కుటుంబ వేడుక సందర్భంగా స్టోర్‌రూమ్‌లో విధిని నీళ్ల డబ్బాలో ముంచి చంపినట్టు ఆమె ఒప్పుకుందని మరో రెండు హత్యలు కూడా ఆమె చేసిందని ఆధారాలు ఉన్నాయని వివరించారు.
Add A Comment
