సంగతి న్యూస్ , న్యూఢిల్లీ: మానవత్వం చాటుకునే విషయంలో ఎప్పుడూ ముందుండే భారత్ పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. తాము శ్రీలంకకు సాయం చేద్దామంటే భారత్ అంగీకరించలేదని ఆ దేశ విదేశాంగమంత్రి వ్యాఖ్యలు చేశారు. దీనికి వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ ఆరోపణలను ఖండించింది. పాక్ మాటలు “అసంబద్ధమైనవి” “తప్పుడు సమాచారం వ్యాప్తి చేసివి”గా అభివర్ణించింది.
శ్రీలంక తీరంలో ప్రమాదంలో ఉన్న కొందరికి సాయం చేయడం కోసం భారత వాయుసరిహద్దుల ఉపయోగించుకునేందుకు డిసెంబర్ 1న మధ్యాహ్నం 1 గంటకు పాక్ నుంచి అభ్యర్థన వచ్చిందని, ఆ సహాయం అత్యవసరమని భావించి భారత్ వెంటనే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1, 2025 సాయంత్రం 5:30కు అనుమతిని మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది. ఇది కేవలం భారత్ పై తప్పుడు ప్రచారం చేసే చర్య తప్ప మరొకటి కాదని భారత్ కొట్టిపడేసింది
