సంగతి, టర్కీ: ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్నా రష్యా ఉక్రెయిన్ మధ్య మాత్రం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నల్లసముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్ పై వరుసగా రెండుసార్లు డ్రోన్లతో దాడి జరిగింది. రష్యాకు పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు తెచ్చే విరాట్ షాడో ట్యాంకర్ (క్రూడ్ అయిల్ )పై తాము రెండు డ్రోన్ లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేసింది. శనివారం ఉదయం డ్రోన్ దాడికి గురయ్యే ముందు ట్యాంకర్ సిబ్బంది ఓపెన్-ఫ్రీక్వెన్సీ రేడియోలో అత్యవసర సంకేతం పంపించారు. “ఇది విరాట్ డ్రోన్ అటాక్ -మే డే” అంటూ అందులోని సిబ్బంది అరుపులు అందులో వినిపించాయి. అయితే దాడికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో ఫుటేజీ ప్రకారం అది గాల్లో ఎగిరే ‘డ్రోన్’ కాకుండా నీటిమీద ప్రయాణించే మానవ రహిత సముద్ర వాహనం నుంచి ప్రయాణించే డ్రోన్ కావడం గమనార్హం.
టర్కీ ధృవీకరణ
బ్లాక్ సీ తీరానికి సుమారు 35 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న విరాట్‌పై శుక్రవారం రాత్రి డ్రోన్ దాడి జరిగినట్లు మొదటగా తెలిసిందని టర్కీ రవాణా మంత్రి అబ్దుల్కదీర్ ఉరాలోగ్లూ ఒకరు తెలిపారు. అదే ట్యాంకర్‌పై శనివారం తెల్లవారు జామున మళ్లీదాడి నిర్వహించినట్లు వివరించారు.
ఉక్రెయిన్ బాధ్యత -ఏఎఫ్‌పీ నివేదిక
రష్యా ‘షాడో ఫ్లీట్’కు చెందిన ఈ ట్యాంకర్లపై జరిగిన దాడికి ఉక్రెయిన్ బాధ్యత వహించిందని AFP నివేదించింది. అమెరికా ఒత్తిడిలో శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడిలో సుమారు 70 మిలియన్ డాలర్ల నష్టం రష్యాకు జరిగినట్లు తెలుస్తుంది.
