సాధారణంగా పోర్న్ వీడియోలు చూడాలని ఆన్లైన్లో వెతకడం మొదలుపెట్టిన ఒక యువకుడికి అది భయంకరమైన అనుభవంగా మారింది. తాను చూస్తున్న వీడియోలో ఉన్న జంట తానే, తన గర్ల్‌ఫ్రెండ్ అని గుర్తించడంతో అతడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు.
2023లో హాంకాంగ్‌కు చెందిన ఎరిక్ (అసలు పేరు వెల్లడించలేదు) తన గర్ల్‌ఫ్రెండ్ ఎమిలీతో కలిసి చైనాలోని Shenzhen నగరంలోని ఒక హోటల్లో బస చేశాడు. కొన్ని వారాల తర్వాత, అతడు తరచూ చూసే ఒక అడల్ట్ వెబ్సైట్లో వీడియోలు చూస్తుండగా, ఒక వీడియో అతడిని ఉలిక్కిపడేలా చేసింది.
వీడియోలో కనిపించిన హోటల్ గది, అక్కడ జరిగిన సంఘటనలు… చివరికి అందులో కనిపిస్తున్న జంట తామేనని ఎరిక్ గుర్తించాడు. ఈ విషయాన్ని BBC వెల్లడించింది.
ఆ వీడియోలో ఎరిక్, ఎమిలీ హోటల్ గదిలోకి ప్రవేశించడం, బ్యాగులు ఉంచడం, ఆ తర్వాత జరిగిన వ్యక్తిగత క్షణాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ హోటల్ గదిలో దాచిన స్పై కెమెరా ద్వారా రహస్యంగా రికార్డ్ చేయబడినవని తేలింది. వారి అనుమతి లేకుండానే ఆ వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేయబడి, వేలాది మంది వీక్షించినట్లు సమాచారం.
“ఆ అనుభవం నన్ను పూర్తిగా భయపెట్టింది”
దాదాపు గంటసేపు తమను రహస్యంగా చిత్రీకరించారని ఎరిక్ తెలిపాడు. ఇంతకుముందు స్పై కెమెరా పోర్న్ వీడియోలు చూడటానికి తనకు ఆసక్తి ఉండేదని, అవి సహజంగా అనిపించేవని చెప్పాడు.
“వాళ్లు తమను చిత్రీకరిస్తున్నారని తెలియకపోవడం వల్ల ఆ వీడియోలు నిజంగా అనిపించేవి. సాధారణ పోర్న్ చాలా నాటకీయంగా, నకిలీగా అనిపిస్తుంది” అని అతడు బీబీసీకి తెలిపాడు.
అయితే, అదే తరహా వీడియోలో తానే బాధితుడిగా మారడం అతడిని తీవ్రంగా కుదిపేసింది.
ఈ విషయం ఎమిలీకి చెప్పినప్పుడు ఆమె మొదట నమ్మలేదు. కానీ వీడియో చూసిన తర్వాత ఆమె భయంతో వణికిపోయిందని సమాచారం. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులు ఆ వీడియోను చూసి ఉంటారేమో అన్న భయం ఆమెను వెంటాడింది.
ఈ ఘటన తర్వాత ఇద్దరూ కొన్ని వారాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని, బయటకు వెళ్లేటప్పుడు టోపీలు ధరించడం, హోటళ్లలో ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
చైనాలో కొనసాగుతున్న స్పై కెమెరా సమస్య
ఈ ఘటన తర్వాత స్పై కెమెరా పోర్న్‌పై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని ఎరిక్ తెలిపాడు. ఇకపై అలాంటి వీడియోలు చూడనని, తమ వీడియో మళ్లీ అప్లోడ్ అవుతుందేమో అన్న భయంతో మాత్రమే అప్పుడప్పుడు ఆ వెబ్సైట్లను చెక్ చేస్తానని చెప్పాడు.
చైనాలో పోర్న్ తయారీ, ప్రచారం చట్టవిరుద్ధమైనప్పటికీ, గత పదేళ్లుగా హోటల్ గదుల్లో రహస్యంగా చిత్రీకరించిన స్పై కెమెరా వీడియోలు కొనసాగుతున్నాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. హోటల్ యజమానులు తమ గదుల్లో దాచిన కెమెరాల కోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ సమస్య పూర్తిగా అదుపులోకి రాలేదు.
బీబీసీ నిర్వహించిన దర్యాప్తులో చైనా వ్యాప్తంగా హోటల్ గదుల్లో 180కి పైగా దాచిన కెమెరాలు బయటపడినట్లు వెల్లడైంది. ఇంకా వేల సంఖ్యలో ఇటువంటి వీడియోలు అనేక వెబ్సైట్లలో అమ్ముడవుతున్నట్లు సమాచారం.
ఈ ఘటన వ్యక్తిగత గోప్యత ఎంత సులభంగా ఉల్లంఘించబడుతోందో చూపిస్తూ, హోటళ్ల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
