ఇంటర్నెట్ డెస్క్: సినీ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారని వాళ్ల కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ (ibomma immadi ravi) నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం చిరంజీవి (Chiranjeevi) మాట్లాడారు. అంతకుముందు సౌదీ ప్రమాదంలో మృతులకు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇది చదవండి:మా కుటుంబంలోనూ డిజిటల్ అరెస్ట్: నాగార్జున
‘‘ఎన్నో ఏళ్లుగా ఈ పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీ మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. లైట్‌బాయ్ దగ్గర నుంచి పెద్దపెద్ద డైరెక్టర్ల వరకూ ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవడం.. తిరిగి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయాం. ఇలాంటి సమయంలో గత సీపీ సీవీ ఆనంద్ అనంతరం సజ్జనార్ చాలా కృషి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో పనిచేసిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలి, పైరసీ చూడొద్దు. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు పైరసీ చేశారు. దీనివల్ల ఎంతో నష్టం జరిగింది. త్వరలో రాజమౌళి గొప్ప సినిమా తీయనున్నారు. అప్పుడు మన ఖ్యాతి ఖండాంతరాలు విస్తరిస్తుంది. ఆ సమయంలోను పైరసీ పెనుసవాలుగా ఉంటుంది. ఇండస్ట్రీ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులను అభినందిస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు.
ఈ డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నారు: రాజమౌళి
‘‘పోలీసులకు ధన్యవాదాలు. ఇది సినిమాలో సూపర్ హిట్ సన్నివేశంలా ఉంది. విలన్ ఛాలెంజ్ చేస్తే రెండు నెలల తర్వాత హీరో అతడిని కటకటాల వెనక వేసినట్లు ఉంది. భస్మాసురుడి హస్తంలా తన తలమీద తనే చేయిపెట్టుకున్నాడు. పోలీసులతో ఆటలొద్దు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. ఏదీ ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అది చావు వరకూ తీసుకెళ్తుంది. ‘సినిమాలేగా ఏముంది ఫ్రీగా చూస్తున్నాం’ అని అందరూ అనుకుంటున్నారు. పైరసీ చేసే వాళ్లేం సంఘసేవ చేయడం లేదు. పెద్దపెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తున్నారు. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? మేము వాళ్లకు డబ్బులు ఇవ్వడం లేదు.. మా సినిమాలను పైరసీ చేసి సంపాదిస్తున్నారు. అంటే మీరు ఇస్తున్నారు’’
‘‘మీ వ్యక్తిగత డేటాను అమ్మడం వల్ల ఇస్తున్నారు. ఈ పర్సనల్ డేటా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే చాలు మీరు సైబర్ బారిన పడతారు. ఈ డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నారు. మీరు నంబరే కదా అని ఎంటర్ చేస్తున్నారు. దాని మూలంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. డబ్బులు పోవడమే కాదు.. ప్రాణాలు పోయే వరకూ వెళ్తోంది. ఈ పైరసీ వల్ల మాకంటే మీరే ఎక్కువ నష్టపోతున్నారు. అర్థం చేసుకోండి. ఇలాంటి పైరసీ వెబ్సైట్లలో ఉచితంగా సినిమాలు చూసి ఇబ్బందుల్లో పడకండి’’ అని రాజమౌళి (
