తెలంగాణ :
హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల అత్యున్నత కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటివరకు రోడ్లకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని మార్చి, ఇకపై గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాల పేర్లు రోడ్లకు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు.
ఢిల్లీలో జరిగిన అమెరికా-భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (USISPF) లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గా మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా (Global Education Hub) అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానించారు.
దీనివల్ల తక్కువ ఖర్చుతో, సులభ వీసా విధానాల ద్వారా గ్లోబల్ సౌత్ దేశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.
