ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్!
Staff selection commission (SSC) తాజాగా CGL – Combined Graduate Level Examination 2025 నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 14,582 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలు, మరియు ఇతర సంస్థల్లో వివిధ కేటగిరీలలో ఈ ఉద్యోగాలు ఉంటాయి.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: పోస్టు ఆధారంగా 18 నుండి 32 సంవత్సరాల మధ్య. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా మాత్రమే – https://ssc.gov.in దరఖాస్తు చివరి తేదీ: అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న గడువులోపు.
ఈ పరీక్ష ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్, ఆడిటర్ వంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలకు అవకాశం లభిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగం కలలుగొంటున్నవారు ఈ అవకాశాన్ని మిస్ అవొద్దు!
తక్షణమే SSC అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయండి.
