ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారత స్టార్ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ మరోసారి ఆసియా వేదికపై తన ప్రతిభను చాటుకుంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి డబుల్ గోల్డ్ విజేతగా నిలిచింది.
గురువారం జరిగిన వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి సురేఖ 147-145 తేడాతో భారత సహచర ఆర్చర్ ప్రతీక ప్రదీప్ పై విజయం సాధించింది. టీమ్ ఈవెంట్లో జ్యోతి, ప్రతీక, దీప్షిక త్రయం అద్భుత ప్రదర్శనతో కొరియా జట్టును 236-234 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ విజయాలతో జ్యోతి సురేఖ ఖాతాలో మొత్తం 7 ఆసియా చాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్స్ చేరాయి — ఇది ఆమె ఆర్చరీ కెరీర్లో మరో గర్వకారణ ఘట్టంగా నిలిచింది.
