సంగతి, సినిమా: ఈ వారం మీకోసం పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పలు ప్రపంచ వ్యాప్త చిత్రాలతోపాటు సిరీస్‌లు కూడా ఓటీటీలో సిద్దమయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ కొత్త సంవత్సరంలో మీకు నచ్చిన ఈ చిత్రాలు ఆయా ఓటీటీ ప్లాట్ ఫాంలలో చూసేయండి..
ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే..
మౌగ్లీ: ఈటీవీ విన్
తెలుగులో రొమాంటిక్ యాక్షన్ ఎడ్వంచర్‌గా తెరకెక్కిన చిత్రం మోగ్లీ. ఇది ఈటీవీ విన్లో జనవరి 1, 2026న విడుదలైంది. అడవుల్లో పెరిగిన మురళి అనే యువకుడు జాస్మిన్ అనే నర్తకితో ప్రేమలో పడి ఓ క్రూరమైన అటవీ అధికారి కారణంగా ఎలా మలుపు తిరిగిందన్నదే కథ.
బ్యూటీ-జీ 5
అలేఖ్య అనే యువతి తనతోపాటు చదువుకుంటున్న అర్జున్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత అతడి గురించి తెలుసుకునే విషయాలు పలు అనుమానాలతో థ్రిల్లర్ మూవీలాగా కనిపిస్తుంది. ఈ చిత్రం జీ 5లో శుక్రవారం విడుదలైంది.
రన్ అవే, లవ్ ప్రమ్ 9 టు 5 : నెట్ ఫ్లిక్స్
నెట్ ప్లిక్స్లో జనవరి, 1, 2026లో విడుదలైన చిత్రం రన్ అవే అలాగే లవ్ ఫ్రమ్ 9 టు 5. అనూహ్యంగా దూరమైన తన కూతురు కనుగొనే తండ్రికి కనిపెట్టే సమయానికి ఆమె జీవితం ఎలా మారిందనేది రన్ అవే చిత్రం కాగా
గ్రాసియెలా, మాటియో అనే ఇద్దరు సీఈవో పదవిని లక్ష్యంగా పెట్టుకుని ఏ విధంగా ముందు కెళ్లారన్నదే కథ. వీటితోపాటు మై కొరియన్ బాయ్ ఫ్రెండ్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనేవి కూడా విడుదలయ్యాయి.
లవ్ బియాండ్ వికెట్ : జియో హాట్ స్టార్
తీవ్ర పరాజయాలతో జీవితం కొనసాగిస్తున్నరంగన్ (విక్రాంత్) అనే క్రికెటర్ … ఓటమి పాలయిన ఆటగాళ్లకు కోచ్ గా మారి గౌరవాన్ని పొందే కథ. జియో హాట్ స్టార్‌లో జనవరి 1, 2026న విడుదలైంది.
ది స్మాషింగ్ మెషిన్ : బుక్ మై షో
ప్రఖ్యాత ఎంఎంఏ ఫైటర్ మార్క్ కెర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తీసిన చిత్రమే ది స్మాషింగ్ మెషిన్. డ్వేన్ ది రాక్ జాన్సన్ ఈ పాత్రలో నటించాడు. ఇది అత్యంత బలమైన బయోపిక్. బుక్ మై షోలో జనవరి 1, 2026లో విడుదలైంది.
కుమ్కీ-2- అమెజాన్ ప్రైమ్
భూమి అనే బాలుడికి నీల అనే ఏనుగుకు మధ్య బంధాన్ని చూపించే చిత్రమే కుమ్కీ-2. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 3, 2026న విడుదల కానుంది.
