సంగతి, అంతర్జాతీయం: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తాను గతంలో హెచ్చరించినట్లుగానే నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికా బలగాలతో దాడులు చేయించారు. గురువారం ఆ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు అమెరికా విడుదల చేసింది.
నైజీరియాలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను నిరోధించేందుకే తాము ఈ దాడులు చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఓ సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. “ఐసిస్ ఉగ్రవాదులపై మేం శక్తిమంతమైన దాడులు చేశాం. అమాయకులైన క్రైస్తవులపై దాడులకు ప్రతిగా మేం ఈ దాడులు చేశాం. వారిని దారుణంగా చంపడం ఆపకపోతే నేను నరకం చూపిస్తానని ముందే హెచ్చరించాను. కానీ వారు పట్టించుకోలేదు. తీవ్ర ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అసలు సహించను. ఇప్పుడు వారు ఈ దాడులు వారు అనుభవించాల్సిందే. చనిపోయిన ఉగ్రవాదులకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు” అని ఆయన రాసుకొచ్చారు.
Add A Comment
