సంగతి, అంతర్జాతీయం: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన శత్రు దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. తమ దేశంలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తే సహించేది లేదన్నారు. ఏ విధంగానైతే వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను తమ సైన్యం బంధించిందో మిగితా దేశాల నాయకులకు కూడా అదే గతి పడుతుందని మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
ఈ దేశాలు తమ దేశంలోకి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాయని, అనేక గ్యాంగ్ లకు ఆ దేశాలు ఆశ్రయం ఇస్తున్నాయని పద్ధతి మార్చుకోకపోతే వెనెజులా లాంటి పరిస్థితి చవి చూస్తారని హెచ్చరించారు. అవసరం అయితే, ఆయా దేశాల్లో డ్రగ్స్ తయారీ కేంద్రాలపై తమ బలగాలతో దాడి చేసేందుకు కూడా వెనుకాడబోమని ట్రంప్ చెప్పారు. ఇప్పటికే అమెరికా ప్రత్యేక కమాండోలు వెనెజులాలోని కారకాస్‌లో ఆపరేషన్ చేపట్టి నకోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ చర్యను కొలంబియా, క్యూబా దేశాలు తప్పు బట్టాయి. ఇది ముమ్మాటికీ అమెరికా దురాక్రమణ చర్యే అని ఖండించాయి. అమెరికా తీసుకోబోయే చర్యలకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతం ఇచ్చాయి.
