దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉల్లంఘనలపై భారీ ఎత్తున అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. తాజా ఆడిట్లో 100కుపైగా సేఫ్టీ, ఆపరేషనల్ నిబంధనల ఉల్లంఘనలు నమోదైనట్లు డీజీసీఏ (DGCA) వెల్లడించింది.
విమాన సిబ్బందికి ఇచ్చే శిక్షణా విధానాల్లోనూ లోపాలు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ సంస్థకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
ఈ పరిణామం విమానయాన రంగంలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ప్రయాణ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి!
Add A Comment
