సంగతి, వాషింగ్టన్ : అమెరికా న్యాయశాఖ వెబ్ సైట్ నుంచి అత్యంత కీలకమైన ఫొటోలు మాయమయ్యాయి. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టేలా ఉన్న ఆ ఫోటో పబ్లిక్ డొమైన్లో శుక్రవారం కనిపించగా ఒక్కరోజులోనే తొలగించబడ్డాయి. అయితే, అక్కడి పౌర సమాజం ఆ ఫోటోలను ఎందుకు తొలగించారని, సాంకేతిక సమస్యనా లేక అధ్యక్షుడి సీక్రెట్ లైఫ్ బయటపడుతుందనా అని ప్రశ్నించుకుంటున్నారు.
ఇంతకీ ఏమిటీ ఈ ఫొటోలు
2019లో జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తిపై సెక్స్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. అతడు అరెస్టయిన తర్వాతజైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, విచారణలో భాగంగా అతడి వద్ద నుంచి విచారణ సంస్థలు వేల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళల నగ్న మహిళల చిత్రాలపెయింటింగ్స్, మరో ఫోటోలో డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్, మెలానియా ట్రంప్ మరియు గిస్లైన్ మ్యాక్స్‌వెల్ కలిసి ఉన్న దృశ్యంలాంటివి ఉన్నాయి. వీటిని అక్కడి అధికారుల ఆదేశాల మేరకు న్యాయశాఖ పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఇవి బయటకు రావడంతో జనాలంత ట్రంప్ గురించి సోషల్ మీడియాలో చర్చ ప్రారంభించారు. దీంతో ఉన్న ఫలంగా 16 డాక్యుమెంట్లు సదరు వెబ్ సైట్ నుంచి మాయమయ్యాయి. ఈ ఫైళ్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారా? లేక సాంకేతిక కారణాలా? అన్న విషయంపై న్యాయ శాఖ స్పందించలేదు.
రాజకీయ దుమారం
ఉన్న ఫలంగా ఫైళ్లు మాయమవ్వడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగాయి. దీనిపై కొందరు డెమోక్రాట్లు స్పందిస్తూ “ఇంకేం దాచిపెడుతున్నారు? అమెరికా ప్రజలకు పూర్తి పారదర్శకత కావాలి” అని ప్రశ్నిస్తున్నారు. ఎప్స్టీన్ బాధితురాలు మారినా లాసెర్డా మాట్లాడుతూ, “న్యాయ వ్యవస్థ మళ్లీ మమ్మల్ని విఫలపరిచినట్టే అనిపిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేసింది.
